/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-05T145820.691-jpg.webp)
Megastar Chiranjeevi Vishwambhara: ఆచార్య, గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాల తరువాత..156 వ చిత్రం విశ్వంభర తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మెగాస్టార్. మల్టీ స్టారర్ మూవీ అంటూ వినిపిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబును (Hero Simbu) మరో ప్రధాన పాత్ర కోసం సెలెక్ట్ చేసినట్లు టాక్. సోషియో ఫాంటసీ కథనంగా రూపొందుతున్న ఈ చిత్రం పై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా నయా లుక్ కోసం జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తున్న మెగాస్టార్ వీడియో మరింత హైప్ క్రియేట్ చేసింది. అయితే చాలా రోజుల క్రితం నుంచి ఈ సినిమాలో కథానాయికగా స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) , అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దీనికి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Also Read: Family Star : ఫ్యామిలీ స్టార్ వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపొయింది
విశ్వంభరలో త్రిష ఎంట్రీ
మెగాస్టార్ విశ్వంభర చిత్రంలో హీరోయిన్ గా సౌత్ క్వీన్ త్రిషను ఎంపిక చేసినట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈరోజు విశ్వంభర సెట్స్ పై అడుగుపెట్టిన త్రిషకు చిరంజీవి (Chiranjeevi) , డైరెక్టర్ వశిష్ఠ, నిర్మాతలు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ సందర్భంగా "వెల్కమ్ ఆన్ బోర్డు గార్జియస్" అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి త్రిష కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. "18 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో మళ్లీ కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదీ నాకు ఎంతో గౌరవం. నాకు హృదయపూర్వక స్వాగతం పలికినందుకు చిరంజీవి గారికి ధన్యవాదాలు." అని తెలిపింది.
Welcome on board
The Gorgeous @trishtrashers ! #Vishwambhara pic.twitter.com/wqXUQF4gZH— Chiranjeevi Konidela (@KChiruTweets) February 5, 2024
ఇప్పటికే విశ్వంభర షూటింగ్ మొదలైంది. చాలా రోజుల నుంచే చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్, విక్రమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత ఎమ్‌ఎమ్ కీరవాణి (M M keeravani) సంగీతం అందిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన విశ్వంభర గ్లింప్స్ ఆసక్తికరంగా కనిపించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిరు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
What an honour it is to reunite with the one and only MEGASTAR after 18 years.Thank you so much for the warmest welcome Chiru sir❤️@KChiruTweets https://t.co/PSrJ4O7LEW
— Trish (@trishtrashers) February 5, 2024
Also Read: This Week OTT Release: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు .. ఓటీటీ ప్రియులకు పండగే