Sridevi : అతిలోక సుందరి అంటే ఆమెనే... మరెవరూ లేరు..రారు..!

4ఏళ్లకే సినిమా రంగంలోకి అడుగు పెట్టిన శ్రీదేవి.. అందానికి, అభినయానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. అతిలోక సుందరి అంటే అందరి మదిలో మెదిలే రూపం శ్రీదేవిదే. జాతీయ స్థాయిలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం.

New Update
Sridevi : అరుదైన గౌరవం అందుకున్న అతిలోక సుందరి.. ముంబైలోని ఆ ఏరియాకు శ్రీదేవి పేరు!

Actress Sridevi Birthday : అందానికి , అభినయానికి ఆమె కేరాఫ్‌ అడ్రస్‌. అతిలోక సుందరి అంటే అందరి మదిలో ఠక్కున మెదిలో రూపం ఆమెదే. జాతీయ స్థాయిలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న నటి మరెవరో కాదు.. అందాల తార శ్రీదేవి (Sridevi). ఆమె లేరు అన్న నిజాన్ని ఇప్పటికీ ఆమె అభిమానులు నమ్మలేని నిజం. 4 సంవత్సరాల వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టిన శ్రీదేవి... ఆ తరువాత సినిమాల మీద ఆసక్తితో దక్షిణ భారతీయ భాషలన్నిటిని అలవోకగా నేర్చుకున్నారు.

అటు తమిళంతో పాటు తెలుగు, మలయాళ సినిమాల్లో నటించడానికి ఆ భాషలు శ్రీదేవికి ఎంతో హెల్ప్ చేశాయనే చెప్పొచ్చు. 1976లో కే.బాలచందర్‌ డైరెక్షన్‌ లో మూండ్రు ముడిచు సినిమా శ్రీదేవికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆమె నటించిన ఎన్నో సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. హిందీలో జితేంద్ర పక్కన ఎక్కువగా నటించారు శ్రీదేవి. నగీన, మిస్టర్ ఇండియా, చాందినీ, చాల్ బాజ్ సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి.

తెలుగులోనూ అగ్రశ్రేణి నాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao)  డైరెక్షన్‌లో ఆమె ఎక్కువ సినిమాల్లో చేశారు. టాలీవుడ్‌ (Tollywood) సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణతో నటించిన శ్రీదేవి... కృష్ణకి జోడిగా ఎక్కువ సినిమాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవితో నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఎంత సూపర్ హిట్టో తెలిసిన విషయమే.

ఆ సినిమా తరువాత నుంచి అతిలోక సుందరి అంటే శ్రీదేవినే అనే ముద్ర పడిపోయింది. వెంకటేష్‌తో క్షణ క్షణం, నాగార్జునతో గోవిందా గోవింద సినిమాల్లో నటించి అలరించారు. 2002 లో సినిమాల నుంచి కొంచెం గ్యాప్‌ తీసుకున్న శ్రీదేవి 2004 లో ‘మాలినీ అయ్యర్’ అనే సీరియల్ లో నటించారు. కొన్ని టీవీ ప్రోగ్రాంలలో జడ్జిగా కూడా ఉన్నారు. 2012 లో ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాతో మరోసారి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ అలరించారు. 2017 లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో ఆమెను గౌరవించింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌ (Boney Kapoor) ను శ్రీదేవి పెళ్లి చేసుకున్నారు. ఆమెకు జాన్వీకపూర్, ఖుషీ కపూర్ ఇద్దరు ఆడపిల్లలు. 2018, ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు చనిపోయిన శ్రీదేవి తన అందం, నటనతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసి కనరాని లోకాలకు వెళ్లిపోయిన శ్రీదేవికి ఆర్టీవీ పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Aslo Read: క్వార్టర్ బాటిల్ రూ.80 నుంచి 90 లోపే…ఏపీలో కొత్త మద్యం పాలసీలో అదిరిపోయే ఆఫర్‌!

#birthday #tollywood #sridevi
Advertisment
తాజా కథనాలు