Sameera Reddy : చాలామంది ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన 'ఎన్టీఆర్' హీరోయిన్!

హీరోయిన్ సమీరా రెడ్డి తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ స్టార్టింగ్ లో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంది. కెరీర్ తొలినాళ్లలో బ్రెస్ట్‌ గురించి విపరీతమైన చర్చ సాగేదని చెప్పింది. ఆ సమయంలో చాలా మంది తనని సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారని ఎమోషనల్ అయ్యింది.

New Update
Sameera Reddy : చాలామంది ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేశారు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన 'ఎన్టీఆర్' హీరోయిన్!

Actress Sameera Reddy Interview : టాలీవుడ్ (Tollywood) లో నరసింహుడు, అశోక్, జై చిరంజీవ వంటి సినిమాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీరా రెడ్డి (Sameera Reddy).. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా (Social Media) లో ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటోంది. గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో కాస్టింగ్ కౌచ్ (Casting Couch) పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ హీరోయిన్ తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ స్టార్టింగ్ లో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంది.

వాటిని సర్జరీ చేయించుకో అన్నారు...

తాజా ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ.. "నా కెరీర్‌ టాప్‌లో ఉన్నప్పుడు నాపై కొందరు ఒత్తిడి తెచ్చారు. బ్రెస్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ సర్జరీ చేయించుకోవాలని బలవంతం పెట్టారు. ఎంతోమంది హీరోయిన్లు చేయించుకున్నారు. నీకేమైంది? అని అనేవారు. నాకు ఇష్టం లేదని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. నా శరీరంతో ఎలాంటి సమస్య లేనప్పుడు సర్జరీ చేయించుకోనని చెప్పాను.

Also Read : ‘ధమాకా’ కాంబో ఈజ్ బ్యాక్.. పూజా కార్యక్రమాలతో మొదలైన ‘RT75’ మూవీ.. వైరల్ అవుతున్న పిక్స్!

కొందరు నటీనటులు వారి వయసును దాచేస్తుంటారు. నేను అలా కాదు.. గూగుల్లో నా వయసు రెండేళ్లు తక్కువ చూపిస్తుంటే దాన్ని సరిచేశాను. 40ఏళ్లు పైబడినా నేను ఎంతో ఉత్సాహంగా ఉంటున్నా. నా చర్మం డల్‌గా ఉన్నప్పుడూ సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేస్తాను. మేకప్‌ వేసుకున్నప్పుడు కూడా పంచుకుంటాను. అలా చేయడం వల్ల నాలాంటి ఎంతోమంది మహిళలు స్ఫూర్తిపొందుతారని నేను భావిస్తాను" అంటూ చెప్పుకొచ్చింది.

Advertisment
తాజా కథనాలు