Poorna : ప్లీజ్, పవన్ కళ్యాణ్ తో ఒక్క ఫోటో ఇప్పించు .. నిహారికని బతిమాలుకున్న హీరోయిన్..!

మెగా డాటర్ నిహారిక తాజాగా డ్రామా జూనియర్స్ షోకి గెస్ట్ గా వచ్చింది. ఈ షోలో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై పిల్లలు స్కిట్ వేశారు. స్కిట్ అయ్యాక పూర్ణ మాట్లాడుతూ..' నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. ప్లీజ్ నిహారిక, ఆయనతో ఒక్క ఫోటో ఇప్పించు' అని రిక్వెస్ట్ చేసింది.

New Update
Poorna : ప్లీజ్, పవన్ కళ్యాణ్ తో ఒక్క ఫోటో ఇప్పించు .. నిహారికని బతిమాలుకున్న హీరోయిన్..!

Actress Poorna : సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మామూలు జనాల్లోనే కాదు సెలబ్రిటీల్లో కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల జనసేన గెలిచినప్పుడు కూడా సినీ పరిశ్రమలోని చాలా మంది సెలబ్రిటీలు పవన్ కి అభినందనలు తెలుపుతూ పోస్టులు చేసారు. కొంతమంది సొంతంగా పవన్ ని కలిసి అభినందించారు.

ఇక తాజాగా ఓ హీరోయిన్ పవన్ కళ్యాణ్ తో ఫోటో కోసం మెగా డాటర్ ను ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ పూర్ణ. పూర్ణకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి అభిమానమో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. నిహారిక తాజాగా డ్రామా జూనియర్స్ షోకి గెస్ట్ గా వచ్చింది. ఈ షోలో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై పిల్లలు అదిరిపోయే స్కిట్ వేశారు.

Also Read : ఆ స్టార్ హీరోను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. షాక్ లో ఫ్యాన్స్?

స్కిట్ అయ్యాక చివర్లో పూర్ణ మాట్లాడుతూ.. నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. ప్లీజ్ నిహారిక ఒక్కసారి ఎప్పుడైనా నాకు ఆయనతో ఒక్క ఫోటో ఇప్పించు అని రిక్వెస్ట్ చేసింది. దీంతో నవ్వుకున్న నిహారిక అందుకు సరే అన్నట్లు సమాధానం ఇచ్చింది. కాగా పూర్ణ, నిహారిక ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి చాలా సరదాగా ఉంటారు.

ఇక పూర్ణ విషయానికొస్తే.. ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు, టీవీ షోలు చేస్తుంది. రీసెంట్ గా మహేష్ బాబు నటించిన 'గుంటూరు కరం' సినిమాలో ఐటెం సాంగ్ లో అదిరిపోయే స్టెప్పులేసి ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

Advertisment
తాజా కథనాలు