Nivetha Pethuraj : పోలీసులకు దొరికిపోయిన నివేదా.. ఏంటని అడిగినందుకు గొడవ..!

నటి నివేదా పేతురాజ్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆమె కారును తనిఖీ చేయాలి.. డిక్కీ ఓపెన్ చేయమని అడగ్గా నిరాకరించింది. నేను డిక్కీ ఓపెన్ చేయను.. ఇది పరువుకు సంబంధించిన విషయం. మీకు చెప్పినా అర్ధం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Nivetha Pethuraj : పోలీసులకు దొరికిపోయిన నివేదా.. ఏంటని అడిగినందుకు గొడవ..!
New Update

Tollywood Young Beauty Nivetha Pethuraj : టాలీవుడ్ (Tollywood) యంగ్ బ్యూటీ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో పాగల్, ఆల వైకుంఠపురం, బ్రోచేవారెవరు చిత్రాలతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. చివరిగా విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా తెరకెక్కిన ‘దాస్ కా ధమ్కీ' సినిమాలో చివరిగా కనిపించింది నివేద. 2023లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకుంది.

పోలీసులతో నివేదా వాగ్వాదం

అయితే గత కొన్నిరోజులుగా స్క్రీన్ పై కనిపించని ఈ భామ.. తాజాగా పోలీసులతో గొడవపడుతూ ప్రత్యక్షమైంది. నివేదా పోలీసులతో గొడవపడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆమె వెళ్తున్న కారును తనిఖీ చేయడానికి ...డిక్కీ ఓపెన్ చేయమని అడగ్గా పోలీసులతో వాగ్వాదానికి దిగింది. నేను డిక్కీ ఓపెన్ చేయను.. ఇది పరువుకు సంబంధించిన విషయం. మీకు చెప్పినా అర్ధం కాదని పోలీసులతో వాదనకు దిగింది.

పబ్లిసిటీ స్టెంట్

ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బాగా నటించారు.. ఇది కేవలం పబ్లిసిటీ స్టెంట్ అని కొంతమంది. పోలీసులు యూనిఫాం వేసుకుని క్రాక్స్ చెప్పులు వేసుకుంటారా..? అని మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు. మరో వైపు.. సినిమా ప్రమోషన్స్ లో భాగం అని కూడా అంటున్నారు. ఇక తన పై వైరలవుతున్న ఈ వీడియో గురించి నివేదా మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Also Read; Lucky Baskhar : దుల్కర్‌ సల్మాన్‌ ‘లక్కీ భాస్కర్‌’ రిలీజ్ డేట్ వచ్చేసింది..?

#tollywood #nivetha-pethuraj #vishwak-sen
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe