Manju Warrier : రజినీకాంత్ 'వెట్టైయాన్‌' లో తన పాత్ర ఏంటో రివీల్ చేసిన మలయాళ హీరోయిన్.!

'వెట్టైయాన్‌' చిత్రంలో తన పాత్ర గురించి మంజు వారియర్‌ తాజాగా క్లారిటీ ఇచ్చారు. 'వెట్టైయాన్‌' పర్‌ఫెక్ట్ కాంబినేషన్‌. ఇందులో రజినీకాంత్ సార్ భార్యగా కనిపిస్తా. రజినీ సార్‌తో నా తొలి సినిమా ఇది. నా పాత్ర చాలా ఆసక్తికరంగా సాగుతుందని అన్నారు.

New Update
Manju Warrier : రజినీకాంత్ 'వెట్టైయాన్‌' లో తన పాత్ర ఏంటో రివీల్ చేసిన మలయాళ హీరోయిన్.!

Actress Manju Warrier :తమిళ సినిమా పరిశ్రమలో అతి పెద్ద స్టార్‌గా గుర్తింపు పొందిన రజినీకాంత్‌తో (Rajinikanth) కలిసి నటించే అవకాశం దక్కడం ఏ హీరోయిన్‌కు అయినా కలలాంటిది. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న నటీమణి మంజు వారియర్. ఆమె రజినీకాంత్‌తో కలిసి నటించిన తొలి చిత్రం 'వెట్టైయాన్' (Vettaiyan). ఈ సినిమాలో తన పాత్ర గురించి మంజు వారియర్‌ తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

" నేను జైభీమ్‌ (Jai Bhim) సినిమా చూసిన తర్వాత జ్ఞానవేళ్‌ సార్‌కు అభిమానిని అయ్యా. వెట్టైయాన్‌ పర్‌ఫెక్ట్ కాంబినేషన్‌. ఇందులో రజినీకాంత్ సార్ భార్యగా కనిపిస్తా. రజినీ సార్‌తో నా తొలి సినిమా ఇది. నా పాత్ర చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఇది నేను ఇంతకు ముందు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది" అని మంజు వారియర్ తెలిపారు. ఈ కామెంట్స్‌తో సిల్వర్ స్క్రీన్‌పై మంజు వారియర్‌, తలైవా కాంబో ఎలా కనిపించబోతున్నారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read : నా భర్త టీమిండియా కోచ్.. అతని గురించి ఎవరికీ తెలీదు : తాప్సి

సూపర్ స్టార్ కెరీర్ లో 170 వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఈ సినిమాలో దుషారా విజయన్‌, రితికా సింగ్‌ మేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తున్నారు. మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్‌, రోహిణి ఇతర పాత్రల్లోకనిపించనున్నారు.

Advertisment
తాజా కథనాలు