/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/malavika-jpg.webp)
మాళవికా మోహన్ (Malavika Mohan) ..ఈ ముద్దుగుమ్మ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అభిమానుల్లో మంచి పేరు సంపాదించుకుంది. తన అందం, అభినయంతో నటిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మాళవికా సోషల్ మీడియాలో (Social media) ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.
తనకి సంబంధించిన గ్లామర్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మాళవికా పెట్టిన ఓ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటించిన పా.రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన తంగలాన్ ప్రాజెక్టులో మాళవికా నటించింది.
ఈ చిత్రం కర్ణాటక రాష్ట్రం కోలార్ లోని కేజీఎఫ్ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. దీన్ని స్టూడియో గ్రీన్ పతకం పై ఙాన్‌వేల్ రాజా దీనిని నిర్మించారు. ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా మాళవికా నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన తంగలాన్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.
అసలు విషయానికి వస్తే..ఈ చిత్రంలో మాళవికా మోహన్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్తున్నట్లు సమాచారం. దీని గురించి ఆమెనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టింది. తనకు చిత్ర నిర్మాణంలో అతి కష్టమైన భాగం ఏదైనా ఉంది అంటే అది డబ్బింగేనే అని చెప్పుకొచ్చింది. డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఎవరైనా వచ్చి తన చేతిని పట్టుకుంటారా అని అడిగింది.
ఈ విషయం తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొనడంతో అది కాస్తా వైరల్ గా మారింది. కాగా, మాళవికా కొద్దిరోజుల క్రితం మన్సూర్ అలీఖాన్ – త్రిష వివాదంపై స్పందించారు. త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మన్సూర్‌పై విరుచుకుపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.
మాళవికా ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత రజినీ కాంత్ సినిమా పేట చిత్రంలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. విజయ్ కు జంటగా మాస్టర్ మూవీలో నటించింది. ఆ సినిమా విజయం సాధించడంతో మాళవికా కి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఆమె ధనుష్ తో కలిసి మారన్ అనే సినిమాలో నటించింది.
Now for the most scary part of the filmmaking process for me..dubbing 🙈
— Malavika Mohanan (@MalavikaM_) November 29, 2023
(Can someone please come and hold my hand while I do it please? 🥺)#thangalaan pic.twitter.com/oM6Yt0BXiW
Also read: రాజమౌళి మహేష్ సినిమాలో చియాన్ విక్రమ్!