Satyabhama Trailer : పోలీస్ ఆఫీసర్ గా కాజల్.. ‘సత్యభామ’ ట్రైలర్ అదిరింది..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సత్యభామ. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సుమన్ చిక్కాల తెరకెక్కించారు. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది.

Satyabhama Trailer :  పోలీస్ ఆఫీసర్ గా కాజల్..  ‘సత్యభామ’ ట్రైలర్ అదిరింది..!
New Update

Kajal Aggarwal As A Police Officer : టాలీవుడ్ (Tollywood) అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సత్యభామ (Satyabhama). సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించగా.. ప్రకాష్ రాజ్, రవి వర్మ, అంకిత్ కొయ్య, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ సన్నివేశాలతో సాగిన సత్యభామ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Kajal Aggarwal

సత్యభామ ట్రైలర్

ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ 'సత్యభామగా' కనిపించింది. ఇక ఈ ట్రైలర్ ఓపెనింగ్ లో.. ఓ అమ్మాయి ప్రాణాన్ని కాపాడడంలో విఫలమైన సత్యభామ సస్పెన్షన్ కు గురవడం చూపించారు. ఇక కేసు తన చేజారిపోయినప్పటికీ ... ఆ అమ్మాయిని హత్య చేసిన హంతకులను పట్టుకోవాలనే కసి ఆమెలో రగులుతూనే ఉంటుంది.  రోజూ ఆ కేసు ఓ పీడకలలా ఆమెను వెంటాడుతూ ఉంటుంది. ఇక ఈ హత్య (Murder) కు సంబందించిన మిస్టరీని సత్యభామ ఎలా ఛేదించింది..? ఈ క్రమంలో ఆమె ఎదుర్కునే సవాళ్లు ఏంటి అనేది ఈ సినిమా కథ అన్నట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ లో కాజల్ యాక్షన్ సన్నివేశాల మరింత హైలెట్ గా నిలిచాయి.

క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సత్యభామ చిత్రం జూన్ 07న విడుదల కానుంది.

Also Read: Yakshini Trailer: ట్రైలరే వణుకు పుట్టిస్తోంది.. మంచు లచ్చక్క సీరీస్ ఓటీటీని ఊపేసేలా ఉందే!

#tollywood #satyabhama-movie #kajal-aggarwal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి