/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-43-3.jpg)
Kajal Aggarwal As A Police Officer : టాలీవుడ్ (Tollywood) అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సత్యభామ (Satyabhama). సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించగా.. ప్రకాష్ రాజ్, రవి వర్మ, అంకిత్ కొయ్య, తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ సన్నివేశాలతో సాగిన సత్యభామ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
సత్యభామ ట్రైలర్
ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ 'సత్యభామగా' కనిపించింది. ఇక ఈ ట్రైలర్ ఓపెనింగ్ లో.. ఓ అమ్మాయి ప్రాణాన్ని కాపాడడంలో విఫలమైన సత్యభామ సస్పెన్షన్ కు గురవడం చూపించారు. ఇక కేసు తన చేజారిపోయినప్పటికీ ... ఆ అమ్మాయిని హత్య చేసిన హంతకులను పట్టుకోవాలనే కసి ఆమెలో రగులుతూనే ఉంటుంది. రోజూ ఆ కేసు ఓ పీడకలలా ఆమెను వెంటాడుతూ ఉంటుంది. ఇక ఈ హత్య (Murder) కు సంబందించిన మిస్టరీని సత్యభామ ఎలా ఛేదించింది..? ఈ క్రమంలో ఆమె ఎదుర్కునే సవాళ్లు ఏంటి అనేది ఈ సినిమా కథ అన్నట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ లో కాజల్ యాక్షన్ సన్నివేశాల మరింత హైలెట్ గా నిలిచాయి.
క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సత్యభామ చిత్రం జూన్ 07న విడుదల కానుంది.
This 7th June, one courageous and fierce woman will go against all odds to deliver Justice 🚔💥
Dive into the thrilling world of #Satyabhama 👊#SatyabhamaTrailer out now!
▶️ https://t.co/P4LKKfbf9C'𝐐𝐮𝐞𝐞𝐧 𝐨𝐟 𝐌𝐚𝐬𝐬𝐞𝐬' @MSKajalAggarwal @Naveenc212 @AurumArtsOffl… pic.twitter.com/GZ4Azcpzx5
— Actor Naveen Chandra (@Naveenc212) May 25, 2024
Also Read: Yakshini Trailer: ట్రైలరే వణుకు పుట్టిస్తోంది.. మంచు లచ్చక్క సీరీస్ ఓటీటీని ఊపేసేలా ఉందే!