ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్‌ల వల్ల డబ్బులు పోగొట్టుకునేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. యూట్యూబర్లు, చివరికి సెలబ్రిటీలు కూడా ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో వీటి ప్రమోషన్లు మరింతగా పెరిగిపోయాయి. అయితే తాజాగా మహారాష్ట్ర సైబర్ సెల్.. ప్రముఖ నటి తమన్నా భాటియాకు సమన్లు జారీ చేసింది. మహదేవ్ ఆన్‌లైన్ గేమింగ్ అనుబంధ సంస్థ అయిన ఫేయిర్‌ప్లే బెట్టింగ్ యాప్‌లో అక్రమ ఐపీఎల్ మ్యాచ్‌లను ఆమె ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో సమన్లు పంపించింది.
Also Read: ఎన్నికలను మేము నియంత్రించలేం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ మ్యాచ్‌లు ఈ బెట్టింగ్ యాప్‌లో అక్రమంగా స్ట్రీమింగ్ అవుతున్నాయని.. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ హక్కులు సొంతం చేసుకున్న సంస్థ ఫిర్యాదు చేసింది. దీంతో తాజాగా తమన్నకు మహారాష్ట్ర సైబర్ సెల్ సమన్లు జారీ చేసింది. వచ్చే వారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి సింగర్ బాద్‌షా అలాగే నటుడు సంజయ్ దత్, నటి జాక్విలీన్ ఫెర్నాండెజ్ మేనేజర్ల స్టేట్‌మెంట్‌లను సైబర్ సెల్ రికార్డ్ చేసింది.
Also Read: ప్రైవేటు ఆస్తి..సమాజానికి చెందినది కాదని అనలేం..సుప్రీంకోర్టు వ్యాఖ్య