Sai DharamTej : పావలా శ్యామలాకు సాయి ధరమ్ తేజ్ ఆర్ధిక సాయం.. కన్నీళ్లు పెట్టుకున్న నటి, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్!

టాలీవుడ్‌ యువ హీరో సాయి ధరమ్ తేజ్‌ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పావలా శ్యామలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.ఈ విషయం తెలుసుకున్న సాయి ధరమ్ తేజ్ పావలా శ్యామలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

Sai DharamTej : పావలా శ్యామలాకు సాయి ధరమ్ తేజ్ ఆర్ధిక సాయం.. కన్నీళ్లు పెట్టుకున్న నటి, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్!
New Update

Actor Sai Dharam Tej : టాలీవుడ్‌ యువ హీరో సాయి ధరమ్ తేజ్‌ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Syamala) కష్టాల్లో ఉన్నట్లు తెలుసుకుని ఆర్థిక సాయం చేయడం చాలా మందిని కదిలించింది. వయసు మీద పడడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పావలా శ్యామలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయం తెలుసుకున్న సాయి ధరమ్ తేజ్, ఆమెకు ఆర్థిక సాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ, తాజాగా పావలా శ్యామలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు." మా అమ్మాయికి ఆపరేషన్‌ అయినప్పుడు సాయిధరమ్‌ తేజ్‌ నాకు ఫోన్‌ చేశారు. ధైర్యం చెప్పారు. వచ్చి కలుస్తానన్నారు. చాలా రోజులైపోయింది. నన్ను మర్చిపోయారేమో అనుకున్నా. కానీ, నన్ను గుర్తుపెట్టుకొని సాయం చేసినందుకు ఆయనకు నా ధన్యవాదాలు" అని తెలిపారు.

Also Read : మనవడిని స్కూల్‌కు తీసుకెళ్లిన తలైవా.. ఫొటోలు వైరల్..!

అనంతరం, ఆమె.. సాయిధరమ్‌తేజ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు. "ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. చనిపోదామనుకున్నా. సమయానికి మీరు సాయం చేసి నాకూ, నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారు" అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘మీరు కన్నీళ్లు పెట్టుకుంటుంటే కష్టంగా ఉంది. ఏడవకండి" అంటూ ఆయన ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సాయి తేజ్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

#pavala-shyamala #actor-sai-dharam-tej
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe