Prithviraj Comments on YCP: రానున్నది టీడీపీ, జనసేన ప్రభుత్వమే-పృథ్వీరాజ్

వైసిపీలో‌ నాకు అన్యాయం జరిగింది, అక్కడి వారే నన్ను రోడ్డున పెట్టారు అని సంచలన కామెంట్స్ చేశారు నటుడు పృథ్వీరాజ్. జగన్ అసలు నాయకత్వం లేని నాయకుడని తిట్టిపోశారు. జగన్ ను నమ్ముకున్న వారు ఎప్పటికైనా రోడ్డున పడాల్సిందే అంటూ తీవ్రంగా విమర్శలు చేశారు.

New Update
Prithviraj Comments on YCP: రానున్నది టీడీపీ, జనసేన ప్రభుత్వమే-పృథ్వీరాజ్

Prithviraj Comments on YCP: వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని, ఏపీలో సీఎం జగన్ (CM Jagan) పాలన అధ్వాన్నంగా ఉందని జనసేన నాయకుడు, సినీ నటుడు పృథ్వీరాజ్ విమర్శించారు. ఇంతకు ముందు వైసిపీలోకి రమ్మని ఒకడు నాకుబ్రెయిన్ వాష్ చేశాడు. అప్పుడు నాకు బ్రెయిన్ లో చిప్ దొబ్బి వైసిపీలో చేరాను. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడే నన్ను ఆహ్వానించారు. కానీ నేను జనసేనలో చేరకుండా తప్పు చేశాను అంటూ చెప్పుకొచ్చారు.

వైసీపీ (YCP) పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ కు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారన్నారు ఆ పార్టీ నేత పృథ్వీరాజ్. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో 2024లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో జనసేన (Janasena Party) తన ప్రభంజనం సృష్టించబోతుందన్నారు పృథ్వీ.మా నాయకుడు పవన్ (Pawan Kalyan) ప్రజల కోసం పాటు పడుతున్నారని పొగిడారు.పవన్ కళ్యాణ్ హుందా రాజకీయాలు చేస్తారని అన్నారు. రానున్నది కచ్చితంగా జనసేన, టిడిపీ (TDP) ప్రభుత్వమే నంటూ జోస్యం చెప్పారు.ప్రజల్లో చైతన్యం వచ్చిందని.. వైసిపీకి రోజులు దగ్గర పడ్డాయని పృథ్వీ విమర్శించారు.మహిళల పై ఎవరూ అసభ్యకరంగా మాట్లాడకూడదు కరెక్టే కానీ మంత్రి రోజా మాత్రం చంద్రబాబు (Chandrababu), పవన్ పై విరుచకపడవచ్చా అంటూ దుయ్యబట్టారు. రోజా మాట్లాడితే మంత్రం, ఇతరులు మాట్లాడితే బూతా అని ప్రశ్నించారు పృథ్వీరాజ్.

చంద్రబాబుది ముమ్మటికీ అక్రమ అరెస్టే అంటూ పృథ్వీ మండిపడ్డారు. చంద్రబాబును తాను గతంలో విమర్శించిన మాట వాస్తవేమే కానీ న్యాయం ఎటు వైపు ఉంటే తాను అటువైపు మాట్లాడతానని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి పై యాగీ లేదని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలిస్తే పవన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని అన్నారు. తనకు జనసేనాని పవన్ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు.

also read:ఏపీ హైకోర్టులో చంద్రబాబు, నారా లోకేష్ పిటిషన్ల విచారణ

చంద్రబాబు కోసం రంగంలోని ముగ్గురు దిగ్గజ లాయర్లు.. వారి ఫీజు ఎంతో తెలుసా?

Advertisment
తాజా కథనాలు