ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. రూ.100 కోట్ల పోంజీ స్కామ్‌లో భాగంగా ఈడీ విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో తెలిపింది. తిరుచ్చికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్‌కు ప్రకాశ్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అయితే ఈ పోంజీ స్కీమ్‌తో మోసం చేశారని ఆ సంస్థపై ఇప్పటికే కేసు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈడీ సమన్లు పంపించిందని అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. ఈనెల 20న ప్రణవ్ జ్యువెలర్స్ కంపెనీ కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేసింది. అయితే ఈ సోదాల్లో ఆ సంస్థ వద్ద లెక్కల్లో చూపించని రూ.23.70 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: మహువా మొయిత్రా వివాదం.. ఎట్టకేలకు మౌనం వీడిన మమతా బెనర్జీ..
తమిళనాడు పోలీసు ఆర్థిక నేరాల విభాగం ఆ సంస్థపై నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండగింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ చేపట్టింది. అయితే బంగారంపై పెట్టుబడుల పథకం కింద ప్రజలకు ఆశ చూపించి వారి నుంచి ఆ సంస్థ రూ.100 కోట్ల వరకు సేకరించినట్లు పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. ఈ మధ్యకాలంలో ప్రకాశ్‌రాజ్ బీజేపీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రస్తుతం ఈడీ నోటీసులు రావడం చర్చనీయాంశమవుతోంది.
Also Read: కాంగ్రెస్‌లో 10 మంది సీఎంలు ఉన్నారు, జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవడు : హరీష్‌రావు