Actor Prakash Raj: రూ.100 కోట్ల స్కామ్ కేసుకు సంబంధించి నటుడు ప్రకాశ్ రాజుకు ఈడీ సమన్లు ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ సమన్లు పంపింది. రూ.100 కోట్ల పోంజీ స్కామ్‌లో భాగంగా విచారణకు హాజరుకావాలని తెలిపింది. ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థపై మనీలాండరింగ్ ఆరోపణలున్న నేపథ్యంలో దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ప్రకాశ్‌రాజ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. By B Aravind 23 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. రూ.100 కోట్ల పోంజీ స్కామ్‌లో భాగంగా ఈడీ విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో తెలిపింది. తిరుచ్చికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్‌కు ప్రకాశ్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అయితే ఈ పోంజీ స్కీమ్‌తో మోసం చేశారని ఆ సంస్థపై ఇప్పటికే కేసు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈడీ సమన్లు పంపించిందని అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. ఈనెల 20న ప్రణవ్ జ్యువెలర్స్ కంపెనీ కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేసింది. అయితే ఈ సోదాల్లో ఆ సంస్థ వద్ద లెక్కల్లో చూపించని రూ.23.70 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. Also Read: మహువా మొయిత్రా వివాదం.. ఎట్టకేలకు మౌనం వీడిన మమతా బెనర్జీ.. తమిళనాడు పోలీసు ఆర్థిక నేరాల విభాగం ఆ సంస్థపై నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండగింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ చేపట్టింది. అయితే బంగారంపై పెట్టుబడుల పథకం కింద ప్రజలకు ఆశ చూపించి వారి నుంచి ఆ సంస్థ రూ.100 కోట్ల వరకు సేకరించినట్లు పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. ఈ మధ్యకాలంలో ప్రకాశ్‌రాజ్ బీజేపీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రస్తుతం ఈడీ నోటీసులు రావడం చర్చనీయాంశమవుతోంది. Also Read: కాంగ్రెస్‌లో 10 మంది సీఎంలు ఉన్నారు, జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవడు : హరీష్‌రావు #telugu-news #national-news #enforcement-directorate #prakash-raj మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి