/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/naresh.jpg)
Naresh Tweet : ఏపీ(AP) లో ప్రస్తుతం వైసీపీ- టీడీపీ(YCP-TDP) మధ్య రాజకీయ రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. మాచర్ల, తిరుపతి, విశాఖ లాంటి పలు జిల్లాలో రాజకీయం రక్తపాతంగా మారుతుంది. వైసీపీ నేతలు - టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఆందోళన పరిస్థితులపై టాలీవుడ్(Tollywood) సినీ నటుడు నరేశ్(Naresh) ట్విట్టర్ లో స్పందించారు.
Also Read: అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం కేసులో ట్విస్ట్..!
ఏపీలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నానన్నారు. తాను ముందుగా ఊహించినట్లుగానే ఏపీలో అధికార మార్పిడికి ముందు రక్తపాతం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఆందోళనకర పరిస్థితులు త్వరగా తొలిగిపోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
The electoral battle in AP is over. there was blood shed before the change of power as I predicted. Now the people have given the verdict. May the most loved leaders of AP people win and may peace reign in AP. Aum Sairam 🙏
— H.E AMB LTCOL SIR Naresh VK actor (@ItsActorNaresh) May 16, 2024