Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం పెళ్లి డేట్ ఇదే.. లీక్ చేసిన హీరోయిన్, వైరల్ అవుతున్న పోస్ట్!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. తాజాగా అతనికి కాబోయే భార్యే పెళ్లి డేట్ ను లీక్ చేసేసింది. కిరణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో పెళ్ళికి మరో 38 రోజులే ఉందని రాసుకొచ్చింది.

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం పెళ్లి డేట్ ఇదే.. లీక్ చేసిన హీరోయిన్, వైరల్ అవుతున్న పోస్ట్!
New Update

Actor Kiran Abbavaram Marriage Date Revealed : టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కొత్తగా పరిచయం అవసరం లేదు. 'రాజావారు రాణిగారు' సినిమాతో నటుడిగా ఆరంగేట్రంచేశాడు. ఇందులో రహస్య గోరఖ్ అనే అమ్మాయి హీరోయిన్‪‌గా చేసింది. అనంతరం SR కల్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణు కథ వంటి హిట్స్ తో ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ హీరో త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే.

తన మొదటి సినిమా హీరోయిన్‌నే ప్రేమించిన ఇతడు.. చాన్నాళ్ల పాటు సీక్రెట్‌ రిలేషన్ మెంటైన్ చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చిలో తన రిలేషన్ గురించి బయటపెట్టి.. సింపుల్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. హైదరాబాద్ (Hyderabad) లో ఓ రిసార్ట్ లో  మార్చి 13న  వీరి నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే తాజాగా కిరణ్ అబ్బవరం పెళ్లి ఎప్పుడో తెలిసిపోయింది. అతనికి కాబోయే భార్యే పెళ్లి డేట్ ను లీక్ చేసేసింది.

Also Read : సూర్య మంచి మనసు.. ఫ్యాన్స్ తో కలిసి ఆ పని చేసిన హీరో, నెటిజన్ల ప్రశంసలు!

జూలై 15న కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా రహస్య (Rahasya) ఓ క్యూట్ రొమాంటిక్ వీడియోని పోస్ట్ చేసి మరీ విషెస్ చెప్పింది. అలానే భర్త అనే పిలిచేందుకు తెగ వెయిట్ చేస్తున్నానని, దీనికి మరో 38 రోజులే ఉందని రాసుకొచ్చింది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తే ఆగస్టు 22న కిరణ్-రహస్య పెళ్లి జరగనున్నట్లు అర్థమవుతుంది. రహస్య పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

#tollywood #rahasya-gorak #actor-kiran-abbavaram-marriage
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe