Kalyan Ram: మామయ్య, బావ, అత్తకు కల్యాణ్‌రామ్ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించడంపై నటుడు కల్యాణ్‌ రాము స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కల్యాణ్‌, బాలకృష్ణ, పురందేశ్వరీలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Kalyan Ram: మామయ్య, బావ, అత్తకు కల్యాణ్‌రామ్ శుభాకాంక్షలు
New Update

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించడంపై నటుడు కల్యాణ్‌ రాము స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌, బాలకృష్ణ, పురందేశ్వరీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబు మావయ్యకీ, నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు!. మీ కృషి మరియు పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను.

Also Read: చంద్రబాబు మామయ్యకు కంగ్రాట్స్.. జూ. ఎన్టీఆర్ ట్వీట్

వరుసగా మూడవ సారి హిందూపురం శాసనసభ్యుడుగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్ కు శుభాకాంక్షలు. భారీ మెజారిటీతో గెలుపొందిన నారాలోకేష్, అత్తగారు పురంధేశ్వరికి శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు. అలాగే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

Also Read: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై స్పందించిన చైనా..

#telugu-news #tdp #kalyan-ram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe