Gang Rape Verdict: రాజస్థాన్‌లోని అజ్మైర్‌లో 1992లో జరిగిన సంఘటన దేధ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 100 మంది కాలేజీ అమ్మాయిలు గ్యాంగ్ రేప్ కు గురైయ్యారు. దాంతో పాటూ వారి నగ్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. మొత్తం 18 మంది ఈ గ్యాంగ్ రేప్ వెనుక ఉన్నారు. ఈ కేసు మీద విచారణ ఇన్నాళ్లుగా కొనసాగుతూనే ఉంది. బాధితులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళకి దీని మీద తీర్పు వెలువడింది. అజ్మైర్‌లోని స్పెషల్ కోర్టు ఈ గ్యాంగ్ రేప్ కేసు నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పును చేప్పింది. దాంతో పాటూ నిందితులు ఒక్కొక్కొరూ 5 లక్షల జరిమానా కూడా కట్టాలని ఆదేశించింది.
అయితే ఈ గ్యాంగ్ రేప్ కేసులో మొత్తం 18 మంది దోషులుగా తేలారు. కానీ ప్రస్తుతం వారిలో ఆరుగురికి మాత్రమే కోర్టు శిక్ష విధించింది. ఎందుకంటే 18 మందిలో ఒకరు సంఘటన జరిగిన వెంటనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మరో ఇద్దరి మీద అక్రమాస్తులు కేసు నమోదైంది. వారు దానిలో శిక్స అనుభవిస్తున్నారు. ఇంకుకు పరారీలో ఉన్నారు. పారిపోయిన వ్యక్తి ఇప్పటికీ దొరకలేదు. మరో నలుగురు ఇప్పటికే శిక్ష అనుభవించి విడుదల అయ్యారు కూడా. దాంతో మిగిలిన ఆరుగురికి అజ్మైర్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును చెప్పింది.