Hyderabad: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఇన్‌స్పెక్టర్

హైదరాబాద్‌ పోలీసు కమీషనరేట్‌లోని ఆర్థిక నేరాల విభాగంలో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్ రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ముందుగా బాధితుడి రూ.15 లక్షలు డిమాండ్ చేసిన ఆయన అడ్వాన్స్ తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు.

New Update
Hyderabad: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఇన్‌స్పెక్టర్

CCS Inspector Sudhakar caught by ACB: హైదరాబాద్‌ పోలీసు కమీషనరేట్‌లోని ఆర్థిక నేరాల విభాగంలో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ సి.హెచ్. సుధాకర్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఓ కేసు విషయంలో బాధితుడు నుంచి రూ.3 లక్షలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్‌లోని ఓల్ట్‌ బోయిన్‌పల్లికి చెందిన మణిరంగ స్వామి.. ఓ కేసు విషయంలో తనకు న్యాయం చేయాలని ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ను ఆశ్రయించారు.

publive-image

Also Read: తెలంగాణలో త్వరలో మహిళా శక్తి క్యాంటీన్లు: సీఎస్ శాంతికుమారి

దీనికి సుధాకర్‌ రూ.15 లక్షలు లంచం ఇవ్వాలని మణిరంగ స్వామిని డిమాండ్‌ చేశాడు. అడ్వాన్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. చివరికి రూ.3 లక్షలకు ఒప్పుకున్నాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సుధాకర్ రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా.. అప్పటికే అక్కడికి వచ్చిన అధికారులు అతడిని పట్టుకున్నారు. ఇదిలాఉండగా.. రెండువారాల క్రితమే ఆర్థిక నేర విభాగంలో పనిచేస్తున్న ఏసీపీ ఉమామహేశ్వరరావును ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం గమనార్హం.

Also Read: తెలంగాణ నిరుద్యోగులకు ఫ్రీగా సివిల్స్ కోచింగ్.. ఇలా అప్లై చేసుకోండి!

Advertisment
తాజా కథనాలు