Ponnam Prabhakar: తెలంగాణలో రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచనున్నామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో (Komatireddy Venkat Reddy) కలిసి ఆయన బస్సులను ప్రారంభించారు. నల్గొండ - హైదరాబాద్ మధ్య నాన్‌స్టాప్ ఏసీ, మూడు డీలక్స్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. కొత్తగా 1000 బస్సులు కొన్నామని.. అలాగే మరో 1500 బస్సులకు కూడా ఆర్డర్ ఇచ్చామని తెలిపారు.
Also Read: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
దసరా పండుగ లోపు నల్గొండ జిల్లాకు 30 ఎక్స్‌ప్రెస్, 30 లగ్జరీ బస్సులు అందిస్తామన్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం డీఏ ఇచ్చినట్లు గుర్తుచేశారు. రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. మిగిలిన రూ.200 కోట్లను కూడా ఈ నెల చివరిలోగా చెల్లిస్తామని చెప్పారు. ఆర్టీసీ సంస్థలో 3,035 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి లగ్జరీ బస్సులు నడుపుతామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల నుంచి ఏసీ బస్సులు ప్రారంభిస్తామని చెప్పారు. మరోవైపు తాము ఇచ్చిన హామీ ప్రకారం మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా రాబోయే బస్సులు 100 బస్సులు నల్గొండకు కేటాయించాలని కోరుతున్నట్లు చెప్పారు.
Also Read: కేయూలో ఉద్రిక్తత.. రిజిస్ట్రార్ ను బంధించిన విద్యార్థులు!