Patanjali : క్షమాపణలు అంగీకరించం..శిక్షకు సిద్ధంగా ఉండండి.. బాబా రామ్‌దేవ్‌ మీద సుప్రీంకోర్టు ఆగ్రహం

తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో బాబా రామ్‌దేవ్‌, పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలక్రిష్ణను ముక్క చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. తప్పుచేసి క్షమాపణలు చెప్తే సరిపోతుందా..శిక్ష పడాలంసిందే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

New Update
Patanjali Case: మీ క్షమాపణలు అంగీకరించం.. పతంజలికి సుప్రీం షాక్!

Supreme Court : బాబా రామ్‌దేవ్‌(Baba Ramdev), పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలక్రిష్ణ(Acharya Balakrishna) కు తలవాచేలా తిట్టిపోసింది భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court). తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు విషయలంఓ బాబారామ్‌దేవ్(Baba Ramdev) స్వయంగా కోర్టుకు వచ్చి క్షమాణలు చెప్పినా అంగీకరించేది లేదని కోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. శిక్ష సిద్ధంగా ఉండాలని సూచించింది. మీ క్షమాపణల పట్ల మేము సంతృప్తి చెందడం లేదని జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అషానుద్దీన్‌ అమానుల్లాలతో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది.

అసలేమనుకుంటున్నారు మీరు..
పతంజలి(Patanjali) కేసులో తమ ఆదేశాలను పట్టించుకోవడం లేదంటూ ఇంతకు ముందు కూడా రామ్‌దేవ్‌ బాబా, బాలకృష్ణల మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు హాజరుకాకపోవడం వంటి విషయాల మీద సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ఈరోజు రామ్‌దేవ్‌ బాబా, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణలు కోర్టుకు హాజరయ్యారు. ఈ విచారణలో వారు క్షమాపణలు కోరుతూ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది కోర్టు. వారం రోజుల్లోగా మళ్లీ కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచించింది. ఏప్రిల్‌ 10న మరోసారి న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.

ప్రకటనలు ఆపేయాలని కోర్టు ఆదేశించాని...మీరు అదే ప్రకటనలు ఇచ్చారంటే ఎంత ధైర్యం? వాటిల్లో శాశ్వత ఉపశమనం అని చెబుతున్నారు. అంటే పూర్తిగా నయం చేస్తారా అంటూ కోర్టు రాందేవ్‌ బాబా, బాలకృష్సలను కడిగి పారేసింది. మరోవైపు పతంజలి వ్యహారాన్ని పట్టించుకోవడం లేదంటూ కేంద్రపైనా సుప్రీంకోర్టు మండిపడింది.

Also Read : ఛాట్ లాక్ ఫీచర్ తో వాట్సప్!

కోర్టు ఆగ్రహం..
అంతకు ముందు తప్పుడు ప్రకటనలు చేసినందుకు పతంజలి ఉత్పత్తుల యాడ్స్ పై సుప్రీం కోర్టు పూర్తిగా నిషేదం విధించింది. గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ మళ్లీ అలాంటి యాడ్స్‌ను ప్రచారం చేడం మీద కోర్టు మండిపడింది. ఈ మేరకు పతంజలి వ్యవస్థాపకులు బాబా రామ్ దేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణలకు ధిక్కార నోటీసులను పంపించింది. పతంజలి పై కోర్టు దిక్కార పిటిషన్‌ మీద సమాధానం ఎందుకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఆయుర్వేద సంస్థ వ్యస్థాపకుల్లో ఒకరైన రామ్‌దావ్‌ బాబాతో పాటూ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ కూడా కోర్టుకు హాజరు కావాలని సమన్లను జారీ చేసింది.

అసలు కేసు ఏమిటి?
ఫిబ్రవరి 27న, రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, ఉబ్బసం, ఊబకాయం వంటి ఇతర వ్యాధుల కోసం పతంజలి ఆయుర్వేదం ఉత్పత్తి చేసే మందుల ప్రకటనలను ప్రచురించకుండా సుప్రీంకోర్టు నిషేధించింది. పతంజలి ఆయుర్వేదం, ఆచార్య బాలకృష్ణలపై ధిక్కార నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2023లో, మెడికల్ ఎఫిషియసీ గురించి లేదా ఔషధ వ్యవస్థను విమర్శించడం గురించి ఎలాంటి ప్రకటనలు లేదా నిరాధారమైన వాదనలు చేయబోమని కంపెనీ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. కానీ కంపెనీ తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేస్తూనే ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు