Vijay Deverakonda: రౌడీ హీరోకు కొత్త తలనొప్పి.. ఫ్యాన్స్ సరే.. మా పరిస్థితేంటని కౌంటర్

ఖుషీ సక్సెస్‌తో ఫుల్ ఖుషిగా ఉన్న టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్‌ పిక్చర్స్‌ షాక్ ఇచ్చింది. మీ అభిమానులకు పెద్ద మనసుతో 100 కుటుంబాలకు రూ.1 కోటి ప్రకటించారు. అదే మంచి మనసుతో రూ.8 కోట్లు నష్టపోయిన మాకు సాయం అందించాలంటూ ట్వీట్‌లో కోరింది.

Vijay Deverakonda: రౌడీ హీరోకు కొత్త తలనొప్పి.. ఫ్యాన్స్ సరే.. మా పరిస్థితేంటని కౌంటర్
New Update

Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)కు గట్టి షాక్ తగిలింది. ‘ఖుషి’ సినిమా సంపాదనలోంచి రూ. కోటి తన అభిమానులకు ఇస్తానని చెప్పి పెద్ద మనసు చాటుకున్నాడు. అయితే ఈ విషయంపై ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ (World Famous Lover) నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్‌ పిక్చర్స్‌ (Abhishek Pictures)చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మా పరిస్ధితి ఏంటి..?

"డియర్ విజయ్ దేవరకొండ..వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి మేం రూ.8 కోట్లు నష్టపోయాం. కానీ దీనిపై ఏ ఒక్కరూ స్పందించలేదు. ఇప్పుడు మీరు పెద్ద మనసుతో 100 కుటుంబాలకు రూ.1 కోటి ప్రకటించారు. అదే మంచి మనసుతో మీరు మమ్మల్ని, మా ఎగ్జిబిటర్లను, డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను కూడా ఆదుకుంటారని ఆశిస్తున్నాం" అంటూ పోస్టు చేసింది. మరి దీనిపై విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Also Read: మంత్రి రోజాకు షాక్ ఇచ్చిన కంగనా.. ఆమె ఎవరో తెలియదు?

కాగా గత శుక్రవారం రిలీజైన ఖుషి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ అలా వచ్చిన పాజిటివ్ టాక్, బ్లాక్ బస్టర్ గా మారడానికి మాత్రం సహకరించలేదు. సోమవారం, మంగళవారం ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఆక్యుపెన్సీ 30శాతానికి పడిపోయింది. సాధారణంగా వీక్ స్టార్టింగ్ ఎంత పెద్ద సినిమాకైనా ఆక్యుపెన్సీ పడిపోతుంది. కానీ ఖుషి సినిమాకు మాత్రం ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. ఇది పక్కా ప్రేమకథ. సీడెడ్ లో ఇలాంటి ప్రేమకథలు పెద్దగా ఆడవు. ఆ ప్రభావం ఖుషి వసూళ్లపై స్పష్టంగా పడింది. కేవలం అర్బన్ లో మాత్రం ఖుషికి మంచి వసూళ్లు వస్తున్నాయి. బి-సెంటర్లు ఓకే కానీ, సి-సెంటర్లలో ఈ సినిమాకు వసూళ్లు దారుణంగా ఉన్నాయి. ఎందుకో సి-సెంటర్ ఆడియన్స్ ఈ సినిమాను ఆదరించలేదు. దీనికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి సినిమాలో మాస్-యాక్షన్ ఎలిమెంట్స్ లేకపోవడం, రెండోది సినిమా నిడివి ఎక్కువగా ఉండడం.

ఇక నైజాంలో పరిస్థితి మరో విధంగా ఉంది. నైజాం మొత్తం వానలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో దంచి కొడుతున్నాయి. దీంతో ఆటోమేటిగ్గా ఖుషి సినిమాకు వసూళ్లు తగ్గిపోయాయి. ఇలా వాతావరణ పరిస్థితులతో పాటు, మరెన్నో కారణాల వల్ల ఖుషి సినిమా డల్ అయింది. ఈ శుక్రవారానికి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty) సినిమా రెడీగా ఉంది. అనుష్క, నవీన్ పొలిశెట్టి నటించిన ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. ఇక షారూక్ నటించిన జవాన్ (Jawan Movie) సినిమా ఉండనే ఉంది. దీంతో ఖుషి సినిమా లాంగ్ రన్ పై అనుమానాలు పెరుగుతున్నాయి.

Also Read:వివాదాల సుడిగుండంలో ‘టైగర్ నాగేశ్వరావు’.. సినిమాను నిలుపుదల చేస్తారా?

#worldfamouslover #abhishek-pictures #vijay-devarakonda #vijay-deverakonda-vs-abhishek-pictures #vijay-deverakonda-vs-abhishek-pictures-issue #rtvlive-com #vijay-deverakonda
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe