Tiger Nageswara Rao: హీరో రవితేజ(ravi teja) నటించిన ‘టైగర్ నాగేశ్వరావు’ సినిమాను వివాదాలు వీడడం లేదు. సినిమాను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్టువర్టుపురం గ్రామస్తులు. తమ జాతిని, తమ గ్రామాన్ని కించపరిచే విధంగా టైగర్ నాగేశ్వరావు సినిమాను నిర్మిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
ఎరుకల జాతి కమ్యూనిటీకి చెందిన టైగర్ నాగేశ్వరావును గజదొంగలాగా చూపించడంతోపాటు, స్టువర్టుపురం ఉన్న అందరూ దొంగలు అనే విధంగా సినిమా తీశారంటున్నారు గ్రామస్తులు. సినిమాను ఆపాలని ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు స్టువర్టుపురం గ్రామస్తులు.
Tiger Nageswara Rao: వివాదాల సుడిగుండంలో ‘టైగర్ నాగేశ్వరావు’.. సినిమాను నిలుపుదల చేస్తారా?
టైగర్ నాగేశ్వరావు సినిమాను నిలిపివేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నిర్మాతకు కోర్టు నోటిసులు అందగా.. మరోవైపు స్టువర్ట్‌పురం గ్రామస్తులు నిరసనలు ఉధృతం చేస్తున్నారు. స్టువర్టుపురం గ్రామాన్ని దక్షిణ భారతదేశం నేర రాజధానిగా చూపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Translate this News: