Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయానికి కచ్చితంగా.. పార్టీ ఏమనుకున్నా సరే: ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ టీమిండియా మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ అయోధ్యలో జరగబోయే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కచ్చితంగా వెళ్తానన్నారు. నా విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్న నేను పట్టించుకోనంటూ స్పష్టం చేశారు. ఇలాంటి పుణ్యకార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా చూడాలంటూ వ్యాఖ్యానించారు. By B Aravind 20 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Ram Mandir : అయోధ్య(Ayodhya) లో మరో రెండ్రోజుల్లో రామ మందిర(Ram Mandir) ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో పలు విపక్ష పార్టీలు ఈ ఆహ్వానాన్ని తిరస్కరించగా టీమిండియా(Team India) మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్(Harbhajan Singh) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లితీరుతానని స్పష్టం చేశాడు. ఎవరు అవునన్నా కాదన్న తన నిర్ణయం మార్చుకొనని కుండబద్దలు కొట్టాడు. తాజాగా ఏఎన్‌ఐ(ANI) వార్తా సంస్థతో హర్భజన్ సింగ్ మాట్లాడారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఎవరు వెళ్తారు.. ఎవరు వెళ్లడం లేదన్న అంశాలతో తనకు సంబంధం లేదన్నారు. Also Read: స్టాలిన్ చేయి పట్టుకుని నడిపించిన మోడీ! ఒకవేళ కాంగ్రెస్(Congress), లేదా ఇతర పార్టీలు వెళ్లొద్దని నిర్ణయించుకుంటే అది వాళ్ల ఇష్టమని అన్నారు. ఆ దేవుడి మీద నాకు నమ్మకమున్న వ్యక్తిగా నేను కచ్చితంగా అక్కడికి వెళ్తానన్నారు. ఒకవేళ తాను అయోధ్యకు వెళ్లడంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తానేది చేయలేదని తెలిపారు. నా విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్న నేను పట్టించుకోనంటూ స్పష్టం చేశారు. ఇలాంటి పుణ్యకార్యాలను రాజకీయాలకు అతీతంగా చూడాలంటూ పార్టీలకు హితువు పలికాడు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం హర్భజన్ సింగ్ పంజాబ్ నుంచి ఆప్ ఎంపీ(AAP MP) గా రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. #WATCH | On opposition parties declining invitation to Ayodhya Ram Temple ‘Pran Pratishtha’ ceremony, former Cricketer and Rajya Sabha MP Harbhajan Singh says, " It is our good fortune that this temple is being built at this time, so we all should go and get the blessings.… pic.twitter.com/YUAplDGMNk — ANI (@ANI) January 19, 2024 Also read: అయోధ్య వేడుకలు పీవీఆర్, ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్షప్రసారం..! ఇటు ఆప్ చీఫ్, ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) కూడా తనకు రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు నుంచి లేఖ వచ్చిందని తెలిపారు. మేము వాళ్లకి ఫోన్ చేస్తే ఈ వేడుకకు నన్ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించేందుకు వస్తామని చెప్పారని.. కానీ ఎవరూ లేదని రాలేదని అయినా పర్లేదని చెప్పారు. ఈ కార్యక్రమానికి వీఐపీ, వీవీఐపీలు వస్తారని వాళ్లు లేఖలో చెప్పారని.. అయినా ఇది భక్తిభావానికి సంబంధించిన విషయమన్నారు. జనవరి 22 తర్వాత తన భార్య పిల్లలు, తల్లిదండ్రులతో అయోధ్యకు వెళ్తానని కేజ్రీవాల్ చెప్పారు. #telugu-news #national-news #ayodhya-ram-mandir #harbhajan-singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి