ED: ఆరోపణలే తప్ప ఒక్క రూపాయి పట్టుకోలేదు.. EDకి పిచ్చి పట్టిందంటున్న ఆప్!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ వ్యవహరిస్తున్న తీరుపై ఆప్ మండిపడుతోంది. తమ నేతలకు వంద కోట్లు చెల్లించడంలో కవిత పాత్ర ఉందనే ప్రకటనను ఖండించింది. 500లకు పైగా సోదాలు, వేల మంది సాక్ష్యులను విచారించి ఒక్క రూపాయి అక్రమ సొమ్ము పట్టుకోలేక విసుగెత్తిపోయి ఆరోపణలు చేస్తోందన్నారు.

ED: ఆరోపణలే తప్ప ఒక్క రూపాయి పట్టుకోలేదు.. EDకి పిచ్చి పట్టిందంటున్న ఆప్!
New Update

Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ (ED) వ్యవహరిస్తున్న తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన కామెంట్స్ చేసింది. మద్యం విధానంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తమ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారనే ఈడీ చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించింది.

ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే..
ఈ మేరకు లోక్‌సభ ఎన్నికల ముందు తమ పార్టీని దెబ్బ తీసే కుట్రలో భాగంగానే ఇలా వ్యవహరిస్తుందని ఆరోపించింది. తమ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ దర్యాప్తు సంస్థ బీజేపీకి పొలిటికల్‌ వింగ్‌లా పనిచేస్తోందంటూ అసహనం వ్యక్తం చేసింది. ‘ఈడీ గతంలోనూ ఇలాంటి ఫేక్ ప్రకటనలు రిలీజ్ చేసింది. ఈ కేసులో 500లకు పైగా సోదాలు జరిపింది. వేల మంది సాక్ష్యులను విచారించింది. అయినా అక్కమంగా ఉన్న ఒక్క రూపాయి కూడా వారికి లభించలేదు. చిన్న సాక్ష్యాన్ని కూడా రికవరీ చేయలేదు. అందుకే విసుగెత్తిపోయి ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. కొత్త ప్రకటనలోనూ ఒక్క కొత్త విషయం లేదు. ఇవన్నీ చూస్తుంటే కేసులో తటస్థ దర్యాప్తు విధానాన్ని వదిలేసి.. బీజేపీకిఇ పొలిటికల్‌ వింగ్‌లా ఈడీ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు' అంటూ ఆప్ నేతలు మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Crime News: బెంగళూరులోని ఓ స్కూల్ సమీపంలో పేలుడు పదార్థాలు..!

ఇక ఈడీ తమ ప్రకటనలో 2021-22 ఢీల్లీ లిక్కర్ కేసు రూపకల్పన, అమలు ద్వారా ప్రయోజనాలు పొందడానికి కవిత, అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా తదితరులు కుట్ర పన్నారని వెల్లడించింది. ఈ ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఆ పార్టీ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో కవిత భాగస్వామి అయ్యారని పేర్కొనడం ఆప్ నేతల ఆగ్రహానికి కారణమైంది.

#ed #liquor-scam #aap
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe