Aadhar Updation : ఆధార్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త!

ఆధార్‌ కార్డు ఫ్రీ అప్‌డేట్ చేసుకోవాలనుకునేవారికి కేంద్రం మరో అవకాశాన్ని ఇచ్చింది. మరో మూడు నెలల పాటు అప్‌డేట్ చేసే సౌకర్యాన్ని పెంచుతున్నట్లు వివరించింది. ఎవరైనా చేసుకోని వారు ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపింది.

New Update
Apaar Id : ఆధార్ తరహాలో దేశంలో అపార్ కార్డులు...బెనిఫిట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..అర్హులెవరో తెలుసా?

ఆధార్‌ ఫ్రీ అప్‌డేట్(Aadhar Free Updation) : చేసుకోవాలనుకుంటున్న వారికి కేంద్రం ఓ గుడ్ న్యూస్‌ చెప్పింది. ఇప్పటి వరకు ఆధార్‌ అప్‌డేట్ చేసుకోని వారికి కేంద్రం(Central Government) మరో అవకాశాన్నిచ్చింది. అసలు ఆధార్‌ ఫ్రీ అప్‌డేట్‌ డిసెంబర్ 14 తో ముగియనుంది. కానీ ఈ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు(Extension) కేంద్రం తెలిపింది.

ఆన్‌ లైన్‌ లోని ఆధార్‌ కార్డులోని మార్పులను ఉచితంగా చేసుకోవాలనుకునేవారికి ఇదో మంచి అవకాశమనే చెప్పవచ్చు. పొడిగించిన గడువు మార్చి 14 , 2024 వరకు ఫ్రీగా ఆధార్‌ కార్డులోని వివరాలను అప్‌డేట్(Update) చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటి వరకు ఎవరైనా అప్‌డేట్‌ చేసుకోకపోతే ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.

ఈ మూడు నెలలు దాటిన తరువాత ఆధార్‌ అప్‌డేట్ చేసుకోవాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ మూడు నెలల్లోనే ఆధార్‌ లో ఉన్న మార్పులను సరి చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆధార్‌ లో మార్పులు, అప్‌డేట్‌ చేసుకోవాలనుకునే వారు ముందుగా https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌ సైట్‌ లో ఆధార్‌ నంబర్ తో లాగిన్‌ అయితే కార్డును అప్‌ డేట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది.

ముందు దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సబ్‌మిట్ చేసేందుకు ప్రొసీడ్‌ టు అప్‌ డేట్‌ ఆప్షన్‌ పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో పేరుతో, ఇతర వివరాలను నమోదు చేస్తూ వాటికి సంబంధించిన పేపర్స్‌ ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దాంతో ఆధార్‌ కి లింక్‌ అయి ఉన్న ఫోన్‌ కు ఓటీపీ వస్తుంది.

దాన్ని ఎంటర్‌ చేసి డాక్యుమెంట్‌ అప్‌డేట్‌ పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో వివరాలు అన్ని స్క్రీన్‌ పై కనిపిస్తాయి. వాటిలో ఏమైనా మార్పులు ఉంటే వాటిని సవరించి క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్‌ ఫ్రీ 1947 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Also read: ఎన్టీఆర్ తో నటించాలని ఉందంటున్న యానిమల్ భామ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు