EPFO : ఆధార్ కార్డు విషయంలో ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పుట్టిన తేదీని అప్ డేట్ చేసుకోవడానికి లేదా కరెక్షన్ కోసం ఆధార్ కార్డ్ చెల్లదు. అంటే ఇప్పుడు ఈపీఎఫ్‌ఓలో ఈ ప్రయోజనం కోసం ఆధార్ కార్డ్ ఉపయోగించడం కుదరదు. EPFO చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితా నుంచి అంటే ఆమోదయోగ్యమైన పత్రాల నుంచి ఆధార్ ను పక్కన పెట్టేసింది. ఈ మేరకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఈపీఎఫ్‌ఓ ఏం చెప్పిందో తెలుసుకుందాం..
కార్మిక మంత్రిత్వ శాఖ తన పరిధిలోకి వచ్చే EPFO, ఆధార్(Aadhaar Card) ఉపయోగించి పుట్టిన తేదీని మార్చలేమని తెలిపింది. ఇందుకు సంబంధించి ఈపీఎఫ్‌వో తాజాగా ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం యూఐడీఏఐ(Uidai) నుంచి లేఖ కూడా అందింది. పుట్టిన తేదీని మార్చుకోవాలని అనుకుంటే, దానికి ఆధార్ కార్డు చెల్లదని పేర్కొంది. దీనిని చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితా నుంచి తీసివేయాల్సిన అవసరం ఉన్నందున ఆధార్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ పత్రాలు కావాలి..
EPFO ప్రకారం, జనన ధృవీకరణ పత్రం సహాయంతో ఈ మార్పు చేయవచ్చు. అంతే కాకుండా, ఏదైనా ప్రభుత్వ బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి పొందిన మార్క్‌షీట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ లేదా స్కూల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ కూడా ఈ ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. ఇది కాకుండా, సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, పాన్ నంబర్, ప్రభుత్వ పెన్షన్, మెడిక్లెయిమ్ సర్టిఫికేట్ అలాగే నివాస ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు.
ఆధార్ ఏ ప్రయోజనం కోసం?
ఆధార్ కార్డు నే గుర్తింపు కార్డుగా, నివాస ధృవీకరణ పత్రంగా ఉపయోగించాలని యూఐడీఏఐ తెలిపింది. కానీ, దానిని జనన ధృవీకరణ పత్రంగా ఉపయోగించకూడదు. ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు. ఇది భారత ప్రభుత్వం(Indian Government) చే జారీ చేసినది. ఇది మీ గుర్తింపు, శాశ్వత నివాసానికి రుజువుగా దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. అయితే ఆధార్(Aadhaar Card) ను తీసుకునే సమయంలో పుట్టిన తేదీని చాలావరకూ తోచిన విధంగా నమోదు చేశారు. అందువల్ల ఇది జనన ధృవీకరణ పత్రానికి ప్రత్యామ్నాయంగా పరిగణించ కూడదని యూఐడీఏఐ స్పష్టం చేసింది.
Also Read: హౌతీల దాడులు..భారత్ కు భారీ నష్టం..నెలకు ఎంత కోల్పోతుందంటే..
Watch this interesting Video :