Medaram : మేడారం వెళ్లే భక్తులకు అలర్ట్‌.. ఇక నుంచి ఆధార్ తప్పనిసరి!

మేడారంలో మొక్కులు తీర్చుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్‌ కార్డ్‌ తీసుకుని వెళ్లాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. జాతరలో ఆధార్‌ కార్డుతో పాటు బంగారం( బెల్లం) కొనుగోలు చేసే వారి ఫోన్‌ నంబర్‌, చిరునామా,ఎందుకు కొంటున్నారు అనే విషయాలను కూడా వివరించాలని అధికారులు తెలిపారు.

New Update
Telangana: రేపు సూళ్ళకు సెలవు..ఆ ఒక్క జిల్లాలో మాత్రమే

Aadhaar : ఇక నుంచి మేడారం(Medaram) లో మొక్కులు తీర్చుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్‌ కార్డ్‌(Aadhaar Card) తీసుకుని వెళ్లాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. జాతరలో ఆధార్‌ కార్డుతో పాటు బంగారం( బెల్లం) కొనుగోలు చేసే వారి ఫోన్‌ నంబర్‌, చిరునామా, బంగారం ఎందుకు కొంటున్నారు అనే విషయాలను కూడా పూర్తి వివరాలతో అధికారులకు తెలియజేయాలని అధికారులు పేర్కొన్నారు.

జిల్లా అధికారుల నుంచి బెల్లం వ్యాపారులకు ఉత్తర్వులు అందాయి. మేడారం జాతర(Medaram Fair) సందర్భంగా నెలకు సుమారు 40 నుంచి 50 టన్నుల వరకు బెల్లం వ్యాపారం జరుగుతుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి బెల్లం ఎక్కువగా రవాణా అవుతుంది. మేడారం జాతర పేరుతో సుమారు 1000 టన్నుల బెల్లం వ్యాపారం జరుగుతుందని అధికారుల అంచనా.

దాంతో బెల్లం పక్కదారి పట్టే అవకాశాలున్నట్లు ఎక్సైజ్‌ శాఖ(Excise Department) తెలిపింది. అందుకే బెల్లం(Jaggery) విక్రయాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. మరికొద్ది రోజుల్లో జాతర సమీపిస్తుండడంతో ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బెల్లం తీసుకుని వచ్చి ఎక్కడికక్కడ దుకాణాలు ఏర్పాటు చేశారు. దీంతో అమ్మవార్లకు కొంత బెల్లం..గుడుంబా తయారీకి కొంత బెల్లాన్ని కొందరు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎక్సైజ్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

మేడారం అమ్మవార్లకు సమర్పించే బంగారం పై ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ఇవ్వాలనే నిబంధనను వెంటనే తొలగించాలని భక్తులు పట్టుబడుతున్నారు. బెల్లం పక్కదారి పట్టకుండా ఇన్ని నిబంధనలు పెడితే భక్తులు జాతరకు దూరం అవుతారని కొందరు అంటున్నారు.
ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని, బెల్లం విక్రయాలపై నిఘా ఉంచితే చాలని కొందరు కోరారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్‌ చేశారు.

Also Read : సోనియాగాంధీని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి

Advertisment
తాజా కథనాలు