తార్నాకలో దారుణం.. బస్సు కోసం వేచివున్న మహిళను యువకులు ఏ చేశారంటే

మహానగరంలో మరో అమానుష ఘటన జరిగింది. లాలాపేట్ వెళ్లేందుకు బస్ కోసం ఎదురుచూస్తున్న మహిళపై సామూహిత్య అత్యచారం జరిగింది. ప్రశాంత్‌ నగర్‌కు చెందిన బర్నే ఏసుడు ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి రైల్వే క్వార్టర్స్ దగ్గర తన స్నేహితులతో కలిసి లైంగిక దాడిచేశారు.

తార్నాకలో దారుణం.. బస్సు కోసం వేచివున్న మహిళను యువకులు ఏ చేశారంటే
New Update

హైదరాబాద్‌లో మహానగరంలో అమానుష ఘటన జరిగింది. తార్నాకలో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళపై యువకులు లైంగిక దాడి చేసిన సంఘటన పట్టణాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆమెను ఇంటిదగ్గర దింపేస్తానని చెప్పి నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లిన ఆ కామాంధుడు అంతటితో ఆగకుండా తన స్నేహితులను సైతం రప్పించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 7వ తేది రాత్రి ఒక మహిళా లాలాపేట్ వెళ్లేందుకు తార్నాక బస్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే మెకానిగ్‌కు పనిచేస్తున్న ప్రశాంత్‌ నగర్‌కు చెందిన బర్నే ఏసుడు అటువైపుగా వచ్చాడు. అయితే ఒంటరిగా నిలబడిన మహిళను గమనించి ఆమెతో సంభాషణ మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్లాలంటూ మాటల్లో దింపి తాను డ్రాప్ చేస్తానని నమ్మించాడు. దీంతో రాత్రి మరింత ఆలస్యం అవుతుండటంతో ఆమెకూడా నమ్మింది. దీంతో తన వాహనంపై ఎక్కించుకున్నాడు. అయితే నేరుగా లాలాపేట్ వెళ్లే బ్రిడ్జ్ ఎక్కాల్సిన బండి రైల్వే క్వార్టర్స్ వైపు తిప్పాడు. ఇంతలోనే ఆమె ప్రశ్నించగా చిన్న పనివుంది. వెంటనే వెళ్లిపోదామంటూ ఆమెను మాటల్లో పెట్టి ప్రశాంత్‌నగర్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోవడంతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఇది కూడా చదవండి : మద్యం మత్తులో ఎమ్మార్వో కుమారుడి డ్రైవింగ్…యువకుడు మృతి

అయితే ఇంతటితో ఆగకుండా అక్కడికి తన నలుగురు స్నేహితులను పిలవడంతో..వారంతా ఆమెపై సామూహిక అత్యచారాని పాల్పడ్డారు. పూర్తిగా నీరసించిపోయిన బాధితురాలిని తార్నాకలోనే బస్టాండ్ సమీపంలో వదిలి వెళ్లిపోయారు. అయితే తెల్లవారు జామున బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించినట్లు తార్నక పరిధి ఎస్సై తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

#tarnaka #boys #raped #woman
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe