Telangana News : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి (Extra Marital Affair) అడ్డొస్తున్నాడని సొంత భర్తను భార్య ప్రియుడితో హత్య చేయించింది. మరో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఈ దారుణానికి నిందితుడి భార్య సైతం సహకరించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెం గౌతమ్‌నగర్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ రమేష్‌కు కొన్నాళ్లుగా రెహానాతో వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ విషయం తెలిసిన రెహానా భర్త సాహు ఈశ్వర్‌కుమార్.. రమేష్‌ను అక్కడినుంచి పంపించేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రమేష్ సింగరేణి క్వార్టర్స్‌లో అక్రమంగా ఉంటున్నాడని ఈశ్వర్‌కుమార్ కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో రమేష్‌ను సింగరేణి (Singareni) అధికారులు అక్కడి నుంచి ఖాళీ చేయించారు.
Also Read : వరంగల్లో దారుణం.. ప్రియురాలి తల్లిదండ్రులను కిరాతకంగా చంపి..
ఆ తర్వాత రమేష్ తో వివాహేతర సంబంధం కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి భార్య తన భర్త హత్యకు కుట్ర పన్నింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఒంటరిగా ఉన్న భర్త ఈశ్వర్‌కుమార్‌పై రమేష్, అతని భార్య ఇందిర, అతని అల్లుడు చందు కత్తులతో దాడి చేశారు. ఆ సమయంలో భార్య రెహానా ఎవరూ రాకుండా ఇంటి బయట కాపలాకాసింది. ఈ దాడిలో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈశ్వర్‌కుమార్ మృతి చెందాడు. తమ ఇల్లు ఖాళీ చేయించాడనే కక్షతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు రెహానా అక్కడి స్థానికులను నమ్మించింది. అయితే రెహానాపై అనుమానంతో ఆమెను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.