Video Viral: కుక్క కోసం వెతుకుతున్న ఓనర్‌కు కెమెరాలో కనిపించిన షాకింగ్‌ ఘటన

పెంపుడు జంతువుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పిపోయిన తన పెంపుడు కుక్క హస్కీ కోసం ఓ వ్యక్తి అంతా వెతుకుతున్నాడు. తన హస్కీ ఎలుగుబంట్లతో కలిసి ఎంచక్కా షికార్లు కొడుతోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Video Viral: కుక్క కోసం వెతుకుతున్న ఓనర్‌కు కెమెరాలో కనిపించిన షాకింగ్‌ ఘటన
New Update

Video Viral: చాలా వరకు జంతువుల తీరు నవ్వు తెప్పిస్తుంది.. అలాగే కొన్నిసార్లు కోపం కూడా వస్తుంటుంది. అవిచేసే పనులు చిన్నపిల్లల్ని తలపిస్తూ ఉంటాయి. పెంపుడు జంతువుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనతో ఇట్టే కలిసిపోయి భావాలను అర్థం చేసుకుంటాయి. రష్యాలో జరిగిన ఓ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తప్పిపోయిన తన పెంపుడు కుక్క హస్కీ కోసం ఓ వ్యక్తి అంతా వెతుకుతున్నాడు. ఆకరికి డ్రోన్‌ కెమెరాల సాయంతో గాలింపు చేపట్టాడు. ఒక ప్రదేశంలో ఓ సీన్‌ చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. అదేంటంటే తన హస్కీ ఎలుగుబంట్లతో కలిసి ఎంచక్కా షికార్లు కొడుతోంది. రష్యాలోని కమ్‌చట్కాలో తప్పిపోయిన హస్కీ కోసం వెతుకుతుంటే ఒక ప్రదేశంలో అది ఎలుగుబంట్లతో కలిసి ఆడుకుంటోంది.

publive-image

సాధారణంగా జంతువుల మధ్య జాతివైర్యం ఎక్కువగా ఉంటుంది. క్రూరమృగాలు ఏదైనా జంతువు దగ్గరికి వస్తే చంపేస్తాయి. అలాంటిది కుక్క వాటితో కలిసి వెళ్తుండటం చూసిన ఓనర్‌ అవాక్కయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. దీనికి రకరకాల కామెంట్లతో పాటు 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

publive-image

అయితే హస్కీ తిరిగి యజమాని దగ్గరకు ఎలా చేరుకుంది అనేది మాత్రం తెలియలేదు. నెటిజన్లు మాత్రం సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కుక్క అసలు ఇంటికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నానని అంటే, మరొకరు దానికి ఎలుగుబంట్లు ఎలా ఫ్రెండ్స్‌ అయ్యారో చెబుతారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎలుగుబంట్లు దాడి చేయకుండా ఎలా ఉన్నాయి, ఇప్పటికే వాటి పిల్లల చేష్టలతో అలసిపోయి దీనిని పట్టించుకోలేదంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: బీచ్‌లో చెత్త వేయకండి..పాపం పాము చూడండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#video-viral
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe