Wild Boar v/s Tiger : తూర్పు గోదావరి జిల్లాలో అడవి పందిని చంపిన పులి.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది. గోపాల‌పురం మండ‌లం రగపాడు గ్రామంలో పెద్దపులి సంచ‌రిస్తోంది. అడ‌విపందిని చంపేసింది. ఉదయాన్నే పశువులకు మేత వేయడానికి వెళ్లిన రైతులు ఈ ఘటనను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

New Update
Tiger: తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి గ్రామంలో పులి కలకలం..

East Godavari : తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరగపాడు గ్రామంలో పులి(Tiger) సంచారం కలకలం రేపుతుంది. అడవి పందిని(Wild Boar) పులి చంపినట్లు తెలుస్తోంది. చనిపోయిన పందిని చూసిన రైతులు(Farmers) ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయాన్నే పశువులకు మేత వేయడానికి వెళ్లిన రైతులకు ఈ ఘటన కనిపించింది. నిన్నటి వరకు మాతంగి మెట్ట వద్ద హల్చల్ చేసిన పెద్దపులి.. నేడు 5 కిలోమీటర్ల సమీపంలో కరగపాడు అనే గ్రామంలో అడవి పందిపై దాడి చేయడంతో అక్కడ స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Also Read: బాపట్ల జిల్లాలో దారుణం.. రైతు భరోసా కేంద్రంలోనే ఉద్యోగి ఆత్మహత్య..!

తాజాగా పంట పొలాల మీద ప్రయాణించిన పులి అడుగుజాడలు క్లుప్తంగా కనిపించడంతో రైతులలో అలజడి మొదలైంది. అయితే, ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు  ఇప్పటివరకు ఏ మాత్రం స్పందించకపోవడంతో పలువురు గ్రామస్తులు మండిపడుతున్నారు. పులి సంచారంతో భయం భయంగా బ్రతుకుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పొలాలకు వెళ్లాలన్న బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న పరిస్థితని వాపోతున్నారు. కాగా, ఏపీ(Andhra Pradesh) లో పలుచోట్లు పులుల సంచారాలు ఎక్కువయ్యాయి. పశువులపై దాడి చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.

Also Read: టీటీడీపై అవాస్తవ విమర్శల దాడి.. భూమన కరుణాకర రెడ్డి షాకింగ్ కామెంట్స్..!

Advertisment
తాజా కథనాలు