ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు వరుసగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడులు మరింత విస్తృతమయ్యే అవకాశం ఉందని.. దీనివల్ల మూడో ప్రపంచ యుద్ధం కూడా రావొచ్చని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 5 రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన ఆయన బుధవారం ఢిల్లీలోని మీడియాతో మాట్లాడారు.
మూడో పక్షం ప్రోత్సహిస్తోంది
ఎర్ర సముద్రంలో హౌతీల దాడులను మూడో పక్షం ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తోందని.. ఇది చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమైన డెన్నిస్ ఫ్రాన్సిస్.. నేటి భౌగోళిక రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా భద్రతా మండలి వ్యవహరించడం లేదన్నారు. దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని సూచనలు చేశారు.
Also Read: ‘ఇల్లు కొంటే భార్య ఫ్రీ’.. వింత ప్రకటన ఇచ్చిన రియల్ ఎస్టేట్ కంపెనీ..
ఇజ్రాయెల్‌కు వెళ్లే నౌకలపై దాడులు
ఇదిలాఉండగా.. ఇటీవల యెమెన్‌ను హస్తగతం చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు.. ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకొని క్షిపణి, డ్రోన్ దాడులు చేయడం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. ఇజ్రాయెల్‌కు వెళ్లే.. అలాగే అక్కడి నుంచి వచ్చే నౌకలపై తాము దాడులు చేస్తున్నామని.. హౌతీ రెబల్స్ ప్రకటన చేశారు.
ఇటీవల కాలంలో హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్, క్షిపణి దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్ (Israel) కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే నౌకలు లేదా ఇజ్రాయెల్‌తో సంబంధమున్న నౌకలను తాము లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇటీవల హౌతీ రెబల్స్ ప్రకటించారు. పాలస్తీనా పోరాటానికి మద్దతుగా ఇజ్రాయెల్‌పై తమ దాడులు జరుగుతూనే ఉంటాయంటూ హెచ్చరించారు. అయితే హౌతీ తిరుగుబాటు దారులు ఇతర నౌకలపై కూడా దాడులు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన అమెరికా, బ్రిటిష్ దళాలు హౌతీ రెబల్స్‌పై బాంబులతో దాడులు చేశాయి.
Also Read: 5 ఏళ్ల చిన్నారిని చంపేసిన మూఢ నమ్మకం.. కన్నకొడుకుకే నీటిలో ముంచి హతమర్చిన తల్లిదండ్రులు!