Kakinada Temple Hundi Robbery: ఈ ప్రపంచంలో నిత్యం ఎక్కడో ఓ చోట దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. దొంగతనం చేశాక కొందరు దొంగలు తెలివిగా తప్పించుకుంటారు. మరికొందరు సీసీ కెమెరాల్లో చిక్కి, లేదా స్థానికుల కంటబడి దొరికిపోతుంటారు. అయితే కొన్ని దొంగతనాలు చూస్తే మాత్రం ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. ఎవరూ ఊహించని రీతిలో డబ్బులు, బంగారం అపహరించుకుపోతారు. అయితే తాజాగా అలాంటి వింత దొంగతనమే ఏపీలోని కాకినాడలో జరిగింది. పట్టపగలే ఏకంగా ఓ ఆలయంలోని హుండీని ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు.
Also Read: కవితకు షాక్.. బెయిల్ పిటిషన్ వాయిదా..
వివరాల్లోకి వెళ్తే.. కాకినాడలోని సంజయ్‌నగర్‌లో ఉన్న అమ్మవారి ఆలయంలోకి ఓ దుండగుడు వచ్చాడు. అమ్మవారిని దర్శించుకున్నాక అక్కడే మెట్లపై ఉండిపోయాడు. కాసేపు అక్కడ వేచి చూశాక ఎవరూ రావడం లేదని గ్రహించాడు. ఆ తర్వాత ఓ సంచిలో ఏకంగా అమ్మవారి హుండీని వేసుకోని ఎత్తుకెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: బిల్డర్ మధు శరీరంపై 30కి పైగా కత్తిపోట్లు.. కేసులో బయటపడ్డ సంచలన నిజాలు