Cricket Heart Attack: నీళ్లు తాగుతూ కుప్పకూలిన క్రికెటర్‌.. చిన్నవయసులోనే ఊహించని మరణం!

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో క్రికెట్‌ ఆడే సమయంలో చల్లనీవాటర్‌ తాగిన ఓ టీనేజర్‌ చనిపోయాడు. సాధారణంగా గేమ్ సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ సమయంలో ఫాస్ట్‌గా కూల్‌ వాటర్‌ తాగకూడదు. ఇది ప్రాణానికే ప్రమాదం.

New Update
Cricket Heart Attack: నీళ్లు తాగుతూ కుప్పకూలిన క్రికెటర్‌.. చిన్నవయసులోనే ఊహించని మరణం!

చాలా మంది క్రికెట్‌(Cricket) ఆడగానే వెంటనే వాటర్‌ తాగేస్తారు. కొంతమంది గ్రౌండ్‌లోనే ఓ లీటర్‌ బాటిల్‌ లేపేస్తారు. మరికొందరు ఇంటికి వచ్చి రిలాక్స్ అవ్వకుండా ఫ్రిడ్జ్‌ ఓపెన్‌ చేసి ఎత్తిన బాటిల్‌ దించకుండా మంచినీళ్లు తాగుతారు. అప్పుడు ఇంట్లో మమ్మీ చెబుతుంది... అలా ఆడి రాగానే తాగవద్దు.. మంచిది కాదు అని..! అయినా వినరు.. కానీ వినాల్సిందే.. ఎందుకంటే ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఇలా తాగితే గుండె పట్టేసే అవకాశం ఉంటుంది. ఇది ప్రాణానికే ప్రమాదం. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో జరిగిన ఈ ఘటన చూస్తే మరో సారి ఆ తప్పు చేయరు.

publive-image ప్రిన్స్‌

క్రికెట్‌ ఆడుతూ మృతి:
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఓ విద్యార్థి క్రికెట్ ఆడుతున్నాడు. ఆటలో ఉండగా, విద్యార్థి అకస్మాత్తుగా చల్లని నీరు తాగాడు. దాని కారణంగా అతను మైదానంలో పడిపోయాడు. అక్కడ ఆడుతున్న ఇతర స్నేహితులు అతన్ని ఒక ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు, అక్కడ డాక్టర్ అతను చనిపోయినట్లు ప్రకటించాడు. ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కుటుంబీకులు మృతదేహాన్ని దహనం చేశారు. విద్యార్థి మృతికి గుండెపోటు(Heart Attack) కారణమని వైద్యులు చెబుతున్నారు.

పదో తరగతిలోనే అనంతలోకాలకు:
అమ్రోహాలోని మొహల్లా కాయస్థాన్ నివాసి అయిన 16 ఏళ్ల ప్రిన్స్ 10వ తరగతి చదువుతున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం ప్రిన్స్‌ తన స్నేహితులతో కలిసి చాముండా గుడి సమీపంలోని మైదానంలో క్రికెట్‌ ఆడుతున్నాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో విద్యార్థికి దాహం వేయడంతో పొలంలో ఉంచిన సీసాలోని చల్లటి నీళ్లు తాగాడు. నీళ్లు తాగిన తర్వాత నేలపై పడిపోయాడు. ప్రిన్స్ అకస్మాత్తుగా పడిపోవడం చూసి, అక్కడ ఉన్న ఇతర స్నేహితులు అతన్ని ఇ-రిక్షా ద్వారా నగరంలోని ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు, అక్కడ పరీక్షించిన తరువాత డాక్టర్ అతను చనిపోయినట్లు ప్రకటించారు. అదే సమయంలో విద్యార్థి మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది. పాఠశాల ఉపాధ్యాయులు, ఇరుగుపొరుగు కుటుంబసభ్యులను ఓదార్చారు. గేమ్ సమయంలో ప్రిన్స్ శరీర ఉష్ణోగ్రత పెరిగిందని అమ్రోహా వైద్యుడు తెలిపారు. ప్రిన్స్‌ వెంటనే చల్లటి నీరు తాగాడని.. దాని కారణంగా ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయిందన్నారు. దీంతో గుండెపోటుతో మృతి చెందినట్టు చెప్పాడు. క్రీడలు, వ్యాయామం చేసిన వెంటనే చల్లటి నీరు తాగకూడదని స్పష్టం చేశారు.

Also Read: ఆ వార్త వినగానే నా కాళ్లు చేతులు ఆడలేదు.. పంత్ యాక్సిడెంట్ పై అక్షర్ ఎమోషనల్

WATCH:

Advertisment
తాజా కథనాలు