Health Tips: కుంగుబాటుతో కూడా బరువు పెరుగుతారు.. సర్వేలో బయటపడ్డ కీలక విషయాలు

కుంగుబాటు వల్ల బరువు పెరుగుతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం తేలింది. కరోనా విజృంభింనప్పుడు ప్రతినెల కొందరి మానసిక ఆరోగ్యాన్ని అలాగే వారి బరువును పరిశీలించారు. కుంగుబాటు లక్షణాలు పెరుగుతే ప్రతినెల 45 గ్రాముల బరువు పెరుగుతున్నట్లు గుర్తించారు.

New Update
Health Tips: కుంగుబాటుతో కూడా బరువు పెరుగుతారు.. సర్వేలో బయటపడ్డ కీలక విషయాలు

మానసిక ఆరోగ్యం, శరీర బరువు ఇవి రెండు కూడా ఒకదానిమీద మరోటి ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి మధ్య ఉన్న సంబంధం గురించి ఇప్పటివరకు పూర్తిగా తెలియలేదు. ముఖ్యంగా మానసికంగా వచ్చే మార్పులు శరీర బరువు మీద ఎలా ప్రభావం చూపిస్తాయి అనే విషయంపై కూడా ఇప్పటివరకు ఎలాంటి పరిశోధనలు జరగలేవు. అయితే దీన్ని ఛేదించేందుకు కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు.

Also Read:  రాగి స్పినాచ్ దోశ.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం

ఇటీవల కొవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా అందరిని వణికించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ విజృంభించిన సమయంలో.. ఈ పరిశోధకులు ప్రతినెల కొందరి మానసిక ఆరోగ్యాన్ని అలాగే వారి బరువును పరిశీలించారు. ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి వంటి తీవ్రతలను బట్టి.. మానసిక ఆరోగ్యాన్ని లెక్కించారు. అయితే మనిషిలో కుంగుబాటు లక్షణాలు పెరుగుతున్న కొద్ది ప్రతినెల 45 గ్రాముల బరువు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి బరువు విషయంలో ఇది తక్కువే అయినప్పటికీ.. కుంగుబాటు లక్షణాలు ఓ మాదిరి నుంచి మధ్యస్థ స్థాయికి చేరుకున్నట్లు తేలడం గమనార్హం.

అయితే ఈ కుంగుబాటు లక్షణాలు అధిక బరువు, ఊబకాయుల్లో మాత్రమే కనిపించండం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాదు వీళ్లు మరింత ఎక్కువ బరువు పెరగడమే కాకుండా.. కుంగుబాటు లక్షణాలతో కూడా మరింత ఎక్కువగా సతమతం అవుతున్నారు. శరీర ఎత్తు, బరువు నిష్పత్తి ఎక్కువగా ఉన్నవారికి మామూలుగానే మానసిక ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు దీనికి కుంగుబాటు తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది. అందుకే ఊబకాయులు కుంగుబాటు లక్షణాలను నియంత్రించుకున్నట్లైతే బరువును అదుపులో పెట్టుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు ఇది శారీరక, మానసిక ఆరోగ్యాలకు కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు.

Also Read: శరీరంలో హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తికి .. ఈ ఆహారాలు తినండి

Advertisment
తాజా కథనాలు