Health Tips : తల్లులు తీసుకునే ఆహారం.. పుట్టబోయే బిడ్డ ఆకారంపై ప్రభావం..

మహిళలు గర్భం దాల్చినప్పుడు వారు తీసుకునే ఆహారం పుట్టబోయే బిడ్డల రూపురేఖలపై ప్రభావం చూపుతాయని ఓ అధ్యయనంలో బయటపడింది. తల్లులు తీసుకునే ప్రోటీన్లు పిల్లల దవడలు, ముక్కు రూపం, పరిమాణాన్ని ప్రభావం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

New Update
Health Tips : తల్లులు తీసుకునే ఆహారం.. పుట్టబోయే బిడ్డ ఆకారంపై ప్రభావం..

Mother's Food : మహిళలు(Women's) గర్భం(Pregnancy) దాల్చినప్పుడు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పుట్టబోయే బిడ్డల రూపురేఖలు అనేవి.. తల్లి ఆహారపు అలవాట్ల(Food Habits) పై ఆధారపడి ఉంటుందని ఇటీవల ఓ అధ్యయనంలో బయటపడింది. గర్భంలో బిడ్డ శరీరం రూపుదిద్దుకునే క్రమంలో.. తల్లి తీసుకునే ఆహారం గణనీయంగా ప్రభావం చూపుతుందని పరిశోధకులు గుర్తించారు. తల్లి ఆహారంలో ప్రోటీన్ స్థాయులకు జన్యువుల పనితీరుకు సంబంధం ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎంటీఓఆర్‌సీ 1 జన్యువులతో ఇది ముడిపడి ఉంటుందని చెప్పారు. పిండం, కపాలం, ముఖం ఆకారంపై ఈ జన్యువులు నేరుగా ప్రభావం చూపిస్తాయని వెల్లడించారు.

Also Read: మిగిలిపోయిన అన్నంతో ఫేస్ ప్యాక్.. మొహం పై జిడ్డు, బ్లాక్ హెడ్స్ మాయం..!

తల్లి ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువైతే.. బిడ్డల దవడలు బలంగా, పదునుగా ఉంటాయి. అలాగే పెద్ద ముక్కులు ఏర్పడతాయి. ఒకవేళ ప్రొటిన్లు తక్కువగా ఉంటే.. పలుచటి, కొనదేలిన లక్షణాలు ఉంటాయి. ఇలా తల్లులు తీసుకునే ప్రోటీన్లు పిల్లల దవడలు, ముక్కు రూపం, పరిమాణాన్ని ప్రభావం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే తల్లులు తీసుకునే నవజాత శిశువల ఆరోగ్యానికి సంబంధం ఉంటుందని గతంలోనే నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది.

ఉదాహరణకు పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారమే తీసుకునే శాఖాహార తల్లుల పిల్లలు తక్కువ బరువుతో పుడతారు. ఊబకాయం(Obesity) ఉన్న తల్లులు జీవక్రియలకు సంబంధించి ముప్పు ఉండే పిల్లలకు జన్మనిస్తారని మరో అధ్యయనంలో తేలింది. ఇలాంటి పిల్లలకు పెరిగే కొద్ది ఫ్యాటీ లివర్ డిసీజ్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. మరోవైపు ప్రాసెస్డ్‌ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే తల్లులు.. తమ గర్భంలో ఉండే పిండాలకు హానికరమైన రసాయనాలను అందిస్తారని మరో అధ్యయనం హెచ్చరించింది.

Also Read: ఈ లాభాల కోసమైన కీర దోసకాయ తినాల్సిందే!

Advertisment
Advertisment
తాజా కథనాలు