Hyderabad: బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ.. ఎక్కడంటే ?

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఫ్రైడే అప్‌ కన్సెల్టెన్సీ కంపెనీ బోర్డు తిప్పేసింది. 200 మందిలో ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షలు చొప్పున తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించింది. శిక్షణ తర్వాత ప్లేస్‌మెంట్ ఇచ్చినట్లు నమ్మించి జీతాలు ఇవ్వకుండా మోసానికి పాల్పడింది.

New Update
Hyderabad: బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ.. ఎక్కడంటే ?

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు చేసేవారి పరిస్థితి ఆందోళకరంగా మారింది. ఎప్పుడు ఉద్యోగాలు పోతాయేమోననే భయం వెంటాడుతోంది. ఇప్పటికే పలు బడా కంపెనీలు కూడా తమ ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని కంపెనీలైతే ఏకంగా బోర్డు తిప్పేస్తున్నాయి. అయితే తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది.

Also Read: కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

అయ్యప్ప సొసైటీలో ఉన్న ఫ్రైడే అప్‌ కన్సెల్టెన్సీ కంపెనీ దాదాపు 200 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుంది. ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల చొప్పున వసూలు చేసింది. ట్రైనింగ్ ఇచ్చి తమ కంపెనీలోనే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించింది. శిక్షణ తర్వాత ప్లేస్‌మెంట్ ఇచ్చినట్లు నమ్మించి జీతాలు ఇవ్వకుండా మోసానికి పాల్పడింది. దీంతో తాము కంపెనీ చేతిలో మోసపోయామని గ్రహించిన బాధితులు శనివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ కంపెనీకి బెంగళూరు, విజయవాడలో కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: దసరా నుంచే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం: సీఎస్ శాంతి కుమారి

Advertisment
Advertisment
తాజా కథనాలు