Naa Saami Ranga: నా సామిరంగ మూవీలో ఆ సీన్ నెక్స్ట్ లెవెల్.. వీడియో లీక్ చేసిన నాగ్

Naa Saami Ranga: నా సామిరంగ మూవీలో ఆ సీన్ నెక్స్ట్ లెవెల్.. వీడియో లీక్ చేసిన నాగ్
New Update

Naa Saami Ranga: కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా రాబోతున్న లేటెస్ట్ చిత్రం 'నా సామిరంగ'. సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. చాలా కాలం తర్వాత పక్కా పల్లెటూరి గెటప్ లో మాస్ యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ తో ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగార్జున. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీవాస్ చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా రిలీజైన నా సామిరంగ ట్రైలర్ తో ప్రేక్షకుల్లో సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది. మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ పవర్ ఫుల్ గా కనిపించింది.

సిగరెట్ సీన్ నెక్స్ట్ లెవెల్

"ఈ పాలి కిష్టయ్య వచ్చాడు.. కిష్టయ్యను వేయాలంటే చావుకు ఎదురెళ్లాలి అంటూ నాగార్జున క్యారెక్టర్ ఎలివేట్ చేసే డైలాగ్స్ సినిమా పై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి". ఇది ఇలా ఉంటే ట్రైలర్  మరో సీన్ హైలెట్ గా కనిపించింది. నాగార్జున ఒక ఐరన్ రాడ్ తో సిగరెట్ వెలిగించిన సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ సీన్ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసేలా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సీన్ చూసిన నాగ్ ఫ్యాన్స్ అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్, మాస్ మసాలా  అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సినిమాలో నాగార్జున "కిష్టయ్య" అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.

Also Read: Guntur Kaaram Song: “మావ ఎంతైనా”.. గుంటూరు కారం నుంచి మరో దుమ్ము లేపే సాంగ్

publive-image

ఇప్పటికే సినిమా నుంచి “అంజిగాడు వచ్చేసాడు.. చూసేయండి.. చూసేయండి మాటోచ్చేత్తాది” అంటూ విడుదలైన అంజిగాడి టీజర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరలైన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ దగ్గర పడడంతో సినిమా ప్రీ ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున అండ్ చిత్ర బృందం ఇప్పటికే పలు టీవీ షోస్, ఇంటర్వూస్ లో పాల్గొంటున్నారు. సినిమాలో ఆషికా రంగనాథ్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటించారు. అల్లరి నరేష్ , రాజ్ తరుణ్, నాజర్, రావు రమేష్, మిర్నా మీనన్‌ కీలక పాత్రలు పోషించారు. సినిమాలో అల్లరి నరేష్ జోడిగా మిర్నా మీనన్‌ మంగ పాత్రలో కనిపించనున్నారు.

Also Read: Guntur Kaaram: ‘గుంటూరు కారం’ మేకింగ్ వీడియో వచ్చేసింది.. చూసేయండి

#naa-saami-ranga #akkineni-nagarjuna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి