ఇటీవలి కాలంలో లిక్కర్ లారీలు బోల్తా పడడం.. అందులోని మద్యం బాటిల్స్ కోసం ప్రజలు ఎగబడుతుండడం చాలా సార్లు చూసిందే. యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా గాయాపడ్డారా.. ఏదైనా సాయం చేద్దామా.. అందరూ సేఫేనానన్న ఆలోచనలు మరిచి అందినకాడికి దోచుకెళ్లడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఇక తాజాగా రోడ్డుపై ప్రమాదం జరిగితే కాపాడాల్సిందిపోయి కోళ్లను ఎత్తుకుపోయారు ప్రజలు. యూపీ(Uttar Pradesh)లో జరిగిందీ ఘటన.
ఒకరు మృతి:
చలికాలంలో పొగమంచు కారణంగా ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఆగ్రా(Agra)లోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో పలు వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి. పొగమంచు కారణంగా స్పష్టంగా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. దాదాపు 6 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో డజన్ల కొద్దీ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ట్రాన్స్ యమునా పోలీస్ స్టేషన్ పరిధిలోని జర్నా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
కోళ్లను ఎత్తుకుపోయారు:
ప్రమాదం జరిగిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో స్థానికులు కోళ్లను దోచుకుంటున్నారు. ప్రమాదానికి గురైన వాహనాల్లో కోళ్లను తీసుకెళ్లే వెహికల్ కూడా ఉంది. ఈ ప్రమాదంలో కోళ్లతో ఉన్న వాహనం కూడా ధ్వంసమైంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కోడి మాంసం దొంగిలించేందుకు గుమిగూడారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలను ఆపి కోళ్లను తీసుకెళ్లడం ప్రారంభించారు. వాహనంలో సుమారు రూ.2.5 లక్షల విలువైన కోళ్లు ఉన్నాయని సమాచారం. అంటే పాపం భారీ నష్టమనే చెప్పాలి. ఇక కోళ్లను దోచుకెళ్తున్న వీడియోను కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.
Also Read: పెట్టుబడిదారుల జేబులు కళకళ.. ఒక రోజే రూ.2 లక్షల కోట్లు.. గరిష్టానికి నిఫ్టీ!
WATCH: