/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-27T151649.468-jpg.webp)
Odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టపగలే నడి రోడ్డుపై రక్తం ఏరులై పారింది. అవసరానికి మించిన వేగంతో వెళ్తున్న ఒక బైకర్ కారణంగా మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో అమాయకులు ప్రాణాలు కొల్పోయిన ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఒళ్లు గగుర్లుపొడిచే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా జనాలు ఉలిక్కిపడుతున్నారు.
7 dead in a road accident in Odisha's #Jagdalpur
- Horrific accident captured on CCTV #roadaccident #Odisha | @ShreyaOpines pic.twitter.com/xNGWBFpmuq
— Mirror Now (@MirrorNow) January 26, 2024
ట్రాక్టర్ ను ఓవర్ టెక్ చేయాలని..
ఇక పూర్తి వివారాల్లోకి వెళితే.. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో వేగంగా వెళ్లున్న బైకర్ తన ముందున్న ట్రాక్టర్ ను ఓవర్ టెక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీ ఢీ కొట్టాడు. దీంతో బైకర్ ను కాపాడే ప్రయత్నంలో ఎస్ యూవీ డ్రైవర్ తన వాహానాన్ని ఎడమవైపు తిప్పాడు. కానీ అప్పటికే పక్కన ఆటో వెళ్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది. ఒకేసారి ఆటో, ఎస్ యూవీ, ఆటో ముందున్న రెండు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. అయితే ఇదంతా రొడ్డు పక్కనున్న కిరాణ షాపు సీసీటీవీలో రికార్డు అయింది.
ఇది కూడా చదవండి : Hyderabad Accident : హైదరాబాద్ పాతబస్తీలో ఘోర రోడ్డు ప్రమాదం
రూ. 3 లక్షల ఎక్స్‌గ్రేషియా..
ఇక స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గరలోని కోరాపుట్‌లోని సహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉండగా గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘనపై దిగ్ర్బాంతి వ్యక్తం చేసిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. బోరిగుమ్మలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటింటినట్లు సమాచారం.