AP : స్కూల్ టీచర్ నిర్వాకం.. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా.. బాలికను ఎత్తుకెళ్లి..!

కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ ప్రవేట్ స్కూల్ టీచర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న రాఘవేంద్ర మాయ మాటలు చెప్పి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై AISF విద్యార్థి సంఘం నాయకులు స్కూల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు.

New Update
AP : స్కూల్ టీచర్ నిర్వాకం.. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా.. బాలికను ఎత్తుకెళ్లి..!

Private School Teacher : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యయుడే (Teacher) ఓ బాలికకు మాయ మాటలు చెప్పి ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా (Kurnool District) లో చోటుచేసుకుంది. పత్తికొండలోని ఓ ప్రవేట్ స్కూల్ టీచర్ నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక (Minor Girl) ను రాఘవేంద్ర అనే ఉపాధ్యయుడు మాయ మాటలు చెప్పి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read: ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. పాసు పుస్తకాలకు న్యూ డిజైన్..!

రాఘవేంద్రకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సమాచారం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డను తమకు అప్పగించాలని వేడుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసుపై విచారణ చేపట్టారు.

Also Read: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్‌ రన్‌ సక్సెస్.. 10లక్షల ఎకరాలకు సాగునీరు..!

టీచర్ నిర్వాకం తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్ (AISF) విద్యార్థి సంఘం నాయకులు స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  స్కూల్ పై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి ఆందోళన చేపట్టారు. రాఘవేంద్రపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు జరగకుండా అతడిని శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు