Whatsapp New Feature: వాట్సాప్‌ లో కొత్త ఫీచర్‌..!

వాట్సాప్ లో త్వరలో సరికొత్త ఫీచర్‌ రాబోతున్నట్లు తెలుస్తోంది. యూజర్లు పెద్ద ఫైల్స్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునేలా కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. రెండు ఫోన్ల మధ్య ఫైల్‌లను ట్రాన్స్ఫర్‌ చేయడానికి ఏ థర్డ్ పార్టీ యాప్ అవసరం లేని ఫీచర్‌ వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది.

New Update
WhatsApp: వాట్సాప్ ఇండియాకు గుడ్ బై చెప్పనుందా?: పార్లమెంట్ లో కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

Whatsapp: వాట్సాప్ లో త్వరలో సరికొత్త ఫీచర్‌ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇటీవల కాలంలో యూజర్లు పెద్ద ఫైల్స్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునేలా కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మల్టీమీడియా మెసేజింగ్ యాప్.. వాట్సాప్ ద్వారా రెండు ఫోన్ల మధ్య ఫైల్‌లను ట్రాన్స్ఫర్‌ చేయడానికి ఏ థర్డ్ పార్టీ యాప్ అవసరం లేని ఫీచర్‌ వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. దీనివల్ల వాట్సాప్ ద్వారా నేరుగా అతిపెద్ద ఫైల్‌లను కూడా బదిలీ చేసుకోవచ్చు.

వాట్సాప్లో రాబోయే ఫీచర్ గురించి సమాచారం WABetaInfo ద్వారా అందించడం జరిగింది. ఇది వాట్సాప్ రాబోయే ఫీచర్లను ట్రాక్ చేస్తుంది. ఇది ఆపిల్ , గూగుల్ నియర్ బై షేర్‌ మాదిరిగానే పని చేస్తుంది. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత.. వీడియోలు, ఫోటోలు.. ఇతర ఫైల్‌లను ఒక పరికరం నుండి మరొక పరికరంతో షేర్ చేసుకోవచ్చు.

ముందుగా ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు వస్తుందని.. ఆ తర్వాత ఐఓఎస్‌కు విడుదల చేస్తామని చెబుతున్నారు. ఫైల్‌ను షేర్ చేయడానికి.. స్కానర్ అందుబాటులో ఉంటుంది. స్కాన్ చేసిన తర్వాత రెండు ఫోన్‌లు ఒకదానితో ఒకటి జత చేయడం జరుగుతోంది. మరో గొప్ప విషయం ఏమిటంటే దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు.

Also read:

Advertisment
Advertisment
తాజా కథనాలు