కన్న కూతుళ్లపై ప్రియుడితో లైంగిక దాడి.. కసాయి తల్లికి కేరళ కోర్టు ఏ శిక్ష వేసిందటే

ప్రియుడితో కన్న కూతుళ్లపై లైంగిక దాడి చేయించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది కేరళ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు. 2018-2019లో జరిగిన కేసులో ఆమె ఇరవై వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. నిందితుడు శిశుపాలన్ కేసు విచారణ సమయంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
కన్న కూతుళ్లపై ప్రియుడితో లైంగిక దాడి.. కసాయి తల్లికి కేరళ కోర్టు ఏ శిక్ష వేసిందటే

తన కడుపున పుట్టిన పిల్లలను కంటికిరెప్పలా కాపాడాల్సిన ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. మానవత్వం మరిచి పసి పిల్లల పట్ల కర్కశంగా ప్రవర్తించింది. తాను ఒక మహిళననే విషయం మరిచి మాతృత్వానికే మాయని మచ్చ తెచ్చింది. కట్టుకున్న భర్తను వదిలేసి పరాయి పురుషుడితో సహ జీవనం చేస్తున్న ఆ దుర్మార్గురాలు చివరికి ఆ బాలికలపై కూడా ప్రియుడితో లైంగిక దాడులు చేయించిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఈ మేరకు కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త మానసికంగా అనారోగ్యానికి గురికావడంతో అతడిని వదిలేసిన నిందుతురాలు శిశుపాలన్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. అప్పటికే ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు నానమ్మ దగ్గర ఉంటుండగా.. ఏడేళ్ల చిన్న కూతురును తన వద్దే ఉండేది. ఈ క్రమంలోనే శిశుపాలన్ ఆ బాలికను లైంగిక వేధించడంతోఆమె తీవ్రంగా గాయపడింది. ఆ పసిప్రాణం తన బాధను తల్లికి చెప్పింది. కానీ నిందితురాలు ఆ బిడ్డ మాటలు పట్టించుకోకపోగా పదేపదే శిశుపాలన్ ఇంటికి పంపి లైంగిక దాడికి సహకరించింది. కొద్దిరోజులకు తన వద్దకు వచ్చిన 11 ఏళ్ల అక్కకు ఆ చిన్నారి దారుణం గురించి చెప్పింది. అయితే గతంలోనూ శిశుపాలన్ ఆమెను కూడా వదలకపోవడంతో తొందరగానే అర్థం చేసుకున్న పెద్ద కూతురు చెల్లెను తీసుకుని తమ బామ్మ ఇంటికి వెళ్లారు.

Also read : బీజేపీ గెలిస్తే ఆయనే సీఎం.. మందకృష్ణ మాదిగ సంచలన ప్రకట

ఈ క్రమంలో అసలు విషయం బయటకు రావడంతో పిల్లల్ని బాలల సంరక్షణా కేంద్రానికి తరలించారు. అప్పుడే ఆ బాలికలు తాము ఎదుర్కొన్న భయానక పరిస్థితుల అక్కడి అధికారులకు వెల్లడించారు. ఇదంతా 2018-2019 మధ్య జరిగింది. శిశుపాలన్‌తో పాటు మరో వ్యక్తి కూడా వారిపై లైంగిక దాడి చేసినట్లు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆర్‌ఎస్‌ విజయ్‌ మోహన్ మీడియాకు వెల్లడించారు. కేరళ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు (Kerala special Fast Track Court) ఈ కేసును తీవ్రంగా పరిగణించింది. ఆ తల్లి చర్యలు మాతృత్వానికే అవమానకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ.. 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే రూ. 20 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో 22 మంది సాక్షుల్ని విచారించగా చివరికి కేసు విచారణ సమయంలోనే శిశుపాలన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు