/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mumbai-jpg.webp)
Maharashtra : మహారాష్ట్రలోని పూణెలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఓ ఎలక్ట్రిక్ హార్డ్‌వేర్ షాపులో మంటలు భారీగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. షాపులో నుంచి భారీ ఎత్తున మంటలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునే లోపే నలుగురు మరణించినట్లు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షాపు పూర్తిగా దగ్ధమయ్యింది. ఈ ఘటన పింప్రి-చించ్వాడ్‌లోని పూర్ణానగర్ ప్రాంతంలో జరిగింది. ఎంతమంది గాయపడ్డారు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Maharashtra | Four people died in a fire in Purnanagar area of Pimpri-Chinchwad of Pune district today. Fire gutted an electric hardware shop on the ground floor of a residential building around 5 am today.
— ANI (@ANI) August 30, 2023
(Video: Pimpri-Chinchwad Municipal Corporation Fire Department) https://t.co/it5AVRtTMk pic.twitter.com/D43G8zmieK