Watch Video: వీడి దుంప తెగ.. ఒక్క సెకండ్ లేటయితే చచ్చేవాడు.. ఓ వ్యక్తి రైల్వే ట్రాక్ దాటి ఫ్లాట్‌ఫాం ఎక్కేందుకు ప్రయత్నించగా వేగంగా వస్తున్న వందేభారత్ రైలు నుంచి తప్పించుకున్నాడు. ఒక్క క్షణం ఆలస్యమైన అతడి ప్రాణాలు పోయేవి. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. By B Aravind 23 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని ప్రమాదాల నుంచి రెప్పపాటున బయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది రైల్వే ట్రాక్‌లపై నిర్లక్ష్యంగా నిలబడటం, ట్రైన్ దగ్గరికి రాగానే ఫ్లాట్‌ఫాం పైకి ఎక్కే కొన్ని వీడియోలూ కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా అచ్చం అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఒక్క క్షణం ఆలస్యం అయినా అతడి ప్రాణాలు పోయేవి. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒక వ్యక్తి రైల్వే పట్టాలు దాటి ప్లాట్‌ఫాం పైకి వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ అదే సమయంలో ఆ పట్టాలపై అటునుంచి వేగంగా వందే భారత్ రైలు దూసుకొచ్చింది. ఆ రైలు అతను ఢీకొట్టబోతుంది అన్న సమయానికి అతడు ఒక్కసారిగా ప్లాట్‌ఫాం పైకి ఎక్కేశాడు. ఒక్క క్షణం ఎక్కడం ఆలస్యం అయినా అతడు ఇప్పటికే మృతి చెందేవాడు. Also read: సూర్యాపేటలో పవన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. గద్దర్ పాటతో ఉర్రూతలూగించిన పవర్ స్టార్ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయం మాత్రం వెల్లడించలేదు. జీవితం అనేది ఒక్కసారి చేసే ప్రయాణం.. రెండో అవకాశం తీసుకునేందుకు రివైండ్ బటన్ ఉండదు. పట్టాల నుంచి, వాటిపై దాటే ప్రమాదాల నుంచి దూరంగా ఉండడని ఆర్‌పీఎఫ్ సూచించింది. #Life's a one-time journey, with no rewinds button to take a second chance.! Keep a safe distance from tracks, trespassing risks more than you're willing to gamble. #SafetyFirst#BeResponsible@AshwiniVaishnaw @RailMinIndia pic.twitter.com/uBTgGzewzS — RPF INDIA (@RPF_INDIA) November 23, 2023 #telugu-news #national-news #viral-videos మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి