Accident : దారుణం.. ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందాడు. బస్సు వెనక చక్రాలు అతడి తల మీదుగా వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

TSRTC :హైదరాబాద్‌(Hyderabad) లో విషాదం చోటుచేసుకుంది. మియాపూర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు(RTC Bus) కింద పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేనగర్‌కు చెందిన ఆంజనేయులు(63) జేసీబీ ఎలక్ట్రీషియన్‌(JCB Electrician) పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సోమవారం రోజున ఓ జేసీబీని రిపేర్‌ చేసేందుకు అతను మియాపూర్ వచ్చాడు. పని పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు అతను బొల్లారం రోడ్డులో న్యూ కాలనీ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు.

Also Read: టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఎండకాలం దృష్ట్యా బస్సు సర్వీసులు కుదింపు

అదే సమయంలో.. ఆంజనేయులు ప్రమాదవశాత్తు రోడ్డుపై వెళ్తున్న మియాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు(RTC Bus Accident) కింద పడ్డాడు. బస్సు వెనక చక్రాలు అతడి తల మీదుగా వెళ్లాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కొడుకు చరణ్ తేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

Also read: అనర్హత వేటు పిటిషన్‌..స్పీకర్, కార్యదర్శి,దానం నాగేందర్‎కు హైకోర్టు నోటీసులు.!

Advertisment
తాజా కథనాలు