ఇలా కూడా ఉంటారా.. బతికుండగానే చావు భోజనం పెట్టించాడు..

ఉత్తరప్రదేశ్‌లోని ఓ వ్యక్తి తాను బతికుండానే పెద్దకర్మ కార్యక్రమం నిర్వహించి అతిథులకు భోజనాలు వడ్డించారు. కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన అతడు.. తాను చనిపోతే వాళ్లు సక్రమంగా పెద్దకర్మ నిర్వహించరని భావించి బతికుండగానే దీన్ని జరుపుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

New Update
ఇలా కూడా ఉంటారా..  బతికుండగానే చావు భోజనం పెట్టించాడు..

కొందరు బతికుండానే తమ సమాధులను తవ్వించుకుని.. తాము చనిపోయాక ఇక్కడే పాతిపెట్టాలని తమ సన్నిహితులకు చెప్పిన వ్యక్తులను చూశాం. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మరో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తాను బతికి ఉండగానే పెద్దకర్మ కార్యక్రమం జరిపించుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఆయన ఎందుకు అలా చేశాడో తెలియాలంటే అసలు విషయం తెలుసుకోవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎటా అనే జిల్లాలో కస్బా సకీట్ మండలంలోని మొహల్లా ముషినగర్‌లో హకీమ్‌ సింగ్‌ (55) అనే వ్యక్తి నివాసముంటున్నాడు.

Also Read: భారత్, కెనడా వివాదం.. గణనీయంగా పడిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య

అయితే ఆయనకు ఇంకా వివాహం కాలేదు. అంతేకాదు హకీమ్‌కు ఉన్న భూమిని కూడా తన సోదరుడు లాక్కున్నాడు. అలాగే హకీమ్‌ను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఇక చివరికి చేసేదేం లేక.. హకీమ్ సన్యాసం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. తాను చనిపోతే.. మరణాంతరం తర్వాత చేసే కర్మలను తన కుటుంబ సభ్యులు సక్రమంగా చేయారని అనుకున్నాడు. దీంతో సంక్రాతి పండుగ రోజున ఆ కార్యక్రమాన్ని తానే జరిపించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఆ తర్వాత అందరికి తన పెద్దకర్మ ఆహ్వాన పత్రికలు పంపాడు. హకీమ్ బాధను అక్కడి గ్రామస్థులు అర్థం చేసుకున్నారు. ఈ కార్యక్రమం జరిపించుకునేందుకు అతడికి సహకరించారు. దీంతో మకర సంక్రాంతికి హకీమ అతిథులకు భోజనాలు ఏర్పాటు చేసి విందు ఇచ్చాడు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Also read: ఫైబర్‌ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ

Advertisment
Advertisment
తాజా కథనాలు