Andhra Pradesh: ఏపీలో దారుణం.. చెరువుగట్టుపై మూత్ర విసర్జన చేశాడని..

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కంఠమనేనివారిగూడెంలోని చెరువుగట్టుపై మూత్ర విసర్జన చేసినందుకు దళిత యువకుడు గెడ్డం రవి కుమార్‌ను.. కొందరు దుండగులు విచక్షణారహితంగా కొట్టారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

New Update
Andhra Pradesh: ఏపీలో దారుణం.. చెరువుగట్టుపై మూత్ర విసర్జన చేశాడని..

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కంఠమనేనివారిగూడెంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. చెరువుగట్టుపై మూత్ర విసర్జన చేశారనే కారణంతో దళిత యువకుడు గెడ్డం రవి కుమార్‌ను.. కొందరు దుండగులు విచక్షణారహితంగా కొట్టారు. దీంతో కమ్మ, దళిత యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. శనివారం సాయంత్రం కంఠమనేనివారిగూడెం చెరువుగట్టుపై ఈ ఘటన జరిగింది.

Also Read: కజికిస్తాన్ లో భయానక పరిస్థితులు.. లోకల్ వర్సెస్ నాన్ లోకల్.. విద్యార్థులపై దాడి..!

తీవ్ర గాయాలపాలైన రవి కుమార్‌ ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే రవి కుమార్‌ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లినందుకే అతడిని టార్గెట్ చేసి దాడి చేశారనే ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే అతడి స్నేహితులు దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వివాదం రోజురోజుకు ముదరుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: వారిపై కఠిన చర్యలు తీసుకోండి..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అచ్చెన్నాయుడు లేఖ..!

Advertisment
తాజా కథనాలు