Lake: కోరికలను తీర్చే అద్భుత సరస్సు.. ఎక్కడో తెలుసా?
సిక్కింలోని అందమైన లోయలలో ఉన్న ఖెచెయోపల్రి సరస్సు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సును కోరికలు తీర్చే సరస్సు అని కూడా అంటారు. దీనిలోకి దిగి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందన్న ప్రచారం ఉంది. దీంతో నిత్యం అనేక మంది ఈ సరస్సును సందర్శిస్తారు.